అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నటన, అందంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఫ్యూచర్ హీరోయిన్ గా ఈ బ్యూటీపై అంచనాలు ఉన్నాయి. కాగా జాన్వీ పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
జాన్వీ పర్సనల్ లైఫ్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గ్గా మారుతుంది. తాజాగా జాన్వీ కపూర్ కు తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్ మెంట్ జరిగిందని తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం రీసెంట్ గా ఆమె తన ప్రియుడు శిఖర్ పహారియాతో తిరుమలను సందర్శించడమే కారణం.
జాన్వీ కపూర్, శిఖర్ పహారియా సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. శ్రీవారిని దర్శించుకుని, ఆలయ ఆవరణలో సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో తను సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందని పలువురు నెటిజన్లు; ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
వైరల్ గా మారిన వీడియోల్లో దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసేప్పుడు తన చేతివేలికి డైమండ్ రింగ్ కనిపించింది. దీంతో ఆమె రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనేందుకు బలమైన కారణంగా చెబుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
మరోవైపు వాటిలో ఎలాంటి వాస్తవం లేదని కూడా తెలుస్తోంది. ప్రముఖ Siasat.com రిపోర్ట్స్ ప్రకారం.. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. దీంతో అవన్నీ వట్టి రూమర్లని తెలిపోయింది. ఇప్పుడిప్పుడే జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ జాబితాలో చేరే దిశగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి వార్తలు రావడం షాకింగ్ గా మారింది.
ఇక ఇప్పటికే బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘దేవర’ (Devara) మూవీతో తెలుగు ప్రేక్షకులను పలరించబోతోంది. హిందీలో ‘మిస్టర్ అండ్ మిస్ మహి’, ‘ఉల్జహ’ చిత్రాల్లోనూ నటిస్తోంది.