అలియా భట్ ప్రసవం కోసం రణబీర్ ఎమోషనల్ ప్లానింగ్.. తండ్రి మరణించిన చోటే, ఖర్చు ఎంతంటే ?

First Published Oct 19, 2022, 12:31 PM IST

ఈ ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. 

వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలసి నటిస్తున్నారు.  కొన్ని నెలల క్రితం అలియా భట్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ తన ప్రెగ్నన్సీ ప్రకటించింది. ప్రస్తుతం అలియా భట్ గర్భంతో ఉంటూ అవసరమైన మెడికల్ కేర్ తీసుకుంటోంది. నవంబర్ ఎండింగ్ లో కానీ, డిసెంబర్ మొదటి వారంలో కానీ అలియా భట్ డెలివరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

అయితే రణబీర్ ఫ్యామిలీ అలియా భట్ ప్రసవం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడట. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అలియా భట్ డెలివరీకి హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

ఇదే ఆసుపత్రి ఎంపిక చేసుకోవడానికి కారణం ఉందట. రణబీర్ తండ్రి రిషి కపూర్ అనారోగ్యానికి గురైనప్పుడు చికిత్స తీసుకుంది ఈ ఆసుపత్రిలోనే. అలాగే తుదిశ్వాస విడిచింది కూడా ఈ ఆసుపత్రిలోనే. దీనితో ఎమోషనల్ సెంటిమెంట్ ఫాలో అవుతూ రణబీర్ తనకు పుట్టబోయే బిడ్డ ఈ ఆసుపత్రిలో పురుడు పోసుకోవాలని కోరుకుంటున్నాడట. 

రోజుకి రూ 15000 ఫీజు చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. అలియా భట్, రణబీర్ కపూర్ బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా ఉన్నారు. అలియా గురించి మరో ఆసక్తికర విషయం కూడా వైరల్ అవుతోంది. 

అలియా డెలివరీ తర్వాత ఏడాది పాటు ఎలాంటి సినిమాల్లో నటించడం లేదని టాక్. తన బిడ్డ సంరక్షణ కోసం ఏడాది సమయం అలియా సిల్వర్ స్క్రీన్ కి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

click me!