పచ్చి బూతులు బాబోయ్.. స్పేస్ లలో ఓ రేంజ్ తో తిట్టుకుంటున్న పవన్ కళ్యాణ్-అల్లు అర్జున్ ఫ్యాన్స్

First Published Jun 16, 2024, 8:14 PM IST

అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ కత్తి కట్టిన తెలిసిందే. కాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ దారుణంగా తిట్టుకుంటున్నారు. 
 

Allu Arjun

అల్లు అర్జున్ ని మెగా ఫ్యామిలీ దూరం పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా జరుగుతున్న కోల్డ్ వార్ తారా స్థాయికి చేరింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ట్వీట్ చేసిన అల్లు అర్జున్... నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లడం వివాస్పదం అయ్యింది. 

నాగబాబు పోలింగ్ ముగిశాక సాయంత్రం అల్లు అర్జున్ పై పరోక్షంగా సెటైర్ వేశాడు. ఆయన ట్వీట్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడ్డారు. దాంతో ఆయన సదరు ట్వీట్ డిలీట్ చేశాడు. కాగా సాయి ధరమ్ తేజ్ ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ లో అల్లు అర్జున్, అల్లు స్నేహారెడ్డిని అన్ ఫాలో చేశాడు. మెగా హీరోలు అల్లు అర్జున్ మీద కోపంగా ఉన్నారని ఈ పరిణామం తెలియజేసింది. 

ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఎక్స్ లో స్పేస్ లు కండక్ట్ చేస్తున్నారు. ఈ స్పేస్ లలో అల్లు అర్జున్ ని, ఆయన ఫ్యాన్స్ విపరీతంగా తిడుతున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ ఫాన్స్.. పవన్ కళ్యాణ్, ఆయన ఫ్యాన్స్ ని తిడుతున్నారు. 

ఫోన్ నెంబర్స్ షేర్ చేసుకుంటూ నేరుగా కూడా తిట్టుకుంటున్నారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్వహిస్తున్న స్పేస్ ల లోకి ఎంటర్ అయితే దారుణమైన పదాలు, బూతులు వినాల్సి వస్తుంది. ఫ్యాన్ వార్ పేరుతో కోపం, ద్వేషం స్ప్రెడ్ చేస్తున్నారు. 

Allu Arjun

ఈ ఫ్యాన్ వార్ ఎంత వరకు వెళుతుందో అర్థం కావడం లేదు. అల్లు అర్జున్ అయితే మెగా హీరో  బ్రాండ్ నుండి బయటకు రావాలని పూర్తిగా డిసైడ్ అయ్యాడు. పరిస్థితులు చూస్తుంటే సమీప కాలంలో అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టే సూచనలు కనిపించడం లేదు. ఇక పుష్ప 2 విజయం సాధిస్తే అల్లు అర్జున్ రేంజ్ అంచనా వేయడం కష్టమే. అయితే మెగా ఫ్యాన్స్ ఈ మూవీ మీద నెగిటివ్ ప్రచారం చేసే సూచనలు కలవు.. 

Latest Videos

click me!