'కల్కి 2898 AD' రిలీజ్ ట్రైలర్ చూశారా.. ప్రభాస్, అమితాబ్ మధ్య భీకర పోరు.. చూపు తిప్పుకోలేని విజువల్స్

By tirumala ANFirst Published Jun 21, 2024, 9:30 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం చిత్రం ఇక మరికొన్ని రోజుల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ పేరుతో సెకండ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో నాగ్ అశ్విన్ కథ గురించి మరికొన్ని డీటెయిల్స్ ఇచ్చారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం చిత్రం ఇక మరికొన్ని రోజుల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాలు అంతగా వర్కౌట్ కాలేదు. సలార్ పర్వాలేదనిపించింది. ఇప్పుడు కల్కి 2898 AD పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. 

ఇండియన్ సినిమా చరిత్రలోనే కల్కి ఒక ప్రత్యేక చిత్రం అని చెప్పొచ్చు. సరిగ్గా హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేస్తూ భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఆయన కుమార్తెలు ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత పురాణాలకి సంబంధించిన అంశాలకి సైన్స్ ఫిక్షన్ జోడిస్తూ ఈ కథ సిద్ధం చేశారు. 

Latest Videos

ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ పేరుతో సెకండ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో నాగ్ అశ్విన్ కథ గురించి మరికొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అదే విధంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య జరిగే భీకర పోరుకి సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా చూపించారు. 

సమయం వచ్చింది అంటూ అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుంది.. అలాంటిది మీ లోపల భగవంతుడే ఉన్నాడు అంటూ అమితాబ్.. దీపికా పదుకొనెతో చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. దీనిని బట్టి దీపికా కడుపున పుట్టేది కల్కినే అని క్లారిటీ వచ్చింది. 

కల్కి పుట్ట కూడా అడ్డుకునేందుకు కాంప్లెక్ లోని కమాండర్ ప్రయత్నిస్తుంటాడు. నేను కాపాడతా అని అశ్వథామగా అమితాబ్ ముందుకు వస్తారు. బాగా సంపాదించి  కాంప్లెక్స్ కి వెళ్లాలనేది భైరవ(ప్రభాస్) కోరిక. దీనితో దీపికా పదుకొనెని పట్టించే టాస్క్ భైరవ తీసుకుంటాడు. ఆమెని అశ్వథామ కాపాడుతుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఊహకందని పోరాటం జరుగుతుంది. 

అశ్వథామని ఓడించడానికి భైరవ బుజ్జి సాయం తీసుకుంటాడు. బుజ్జి రకరకాలుగా షేపులు మార్చుకోగలదు. మధ్యలో మహాభారత యుద్ధంలో అశ్వద్ధామ పోరాట సన్నివేసాలని కూడా చూపించారు. మొదటి ట్రైలర్ లో కమల్ హాసన్ భయంకరంగా ఉన్న లుక్ చూపించారు. ఈ ట్రైలర్ లో అదే తరహాలో ఇంకా ఘాటుగా ఆయన లుక్ ఉంటుంది. 

ఎన్ని తరలైనా, ఎన్ని యుగాలైనా మనిషి మారడు మారలేడు అంటూ కమల్ డైలాగ్ ఉంటుంది. కలిపురుషుడు ప్రభావం వల్ల లోకంలో అనేక దారుణాలు జరుగుతుంటాయి. కొందరు నిస్సహాయులు సహాయం కోసం ఎదురుచూస్తుంటారు. మాధవా.. రావుగా.. మరచితివేమో మాటని అంటూ బ్యాగ్రౌండ్ లో పాట వినిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా కల్కి సెకండ్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో, ఎమోషన్స్ తో కట్టిపడేసేలా ఉంది. 

click me!