ఇంటిని తుడవడానికి ఈ దుస్తులను వాడకూడదు తెలుసా?

First Published | Jun 23, 2024, 9:48 AM IST

మనలో చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న పాత, పనికి రాని దుస్తులను ఉపయోగిస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం.. ఇంటిని తుడవడానికి కొన్ని దుస్తులను అస్సలు ఉపయోగించకూడదు. అవేంటంటే? 

ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఇళ్లు కూడా నీట్ గా కనిపిస్తుంది. అయితే చాలా మంది ఇంటిని శుభ్రం చేయడానికి ఎక్కువగా మోప్ లకు బదులుగా ఇంట్లో ఉన్న పనికిరాని, పాత దుస్తులను ఉపయోగిస్తుంటారు. కానీ ఇంటిని శుభ్రం చేయడానికి కొన్ని రకాల దుస్తులను అస్సలు ఉపయోగించకూడదు. వాస్తు ప్రకారం.. మీ ఇంట్లోని ప్రతికూలతను పోగొట్టడానికి శుభ్రపరచడం చాలా ముఖ్యం. కానీ కొన్ని రకాల దుస్తులతో ఇంటిని క్లీన్ చేస్తే మీ ఇంట్లో ప్రతికూలత ఉంటుంది. అందుకే ఎలాంటి దుస్తులతో ఇంటిని తుడవకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

చిన్న పిల్లల బట్టలతో.. 

ఇంట్లో చిన్న పిల్లలుంటే వారి పాత, పనికి రాని దుస్తులను ఇళ్లు తుడవడానికి, దుమ్ము దులపడానికి ఉపయోగిస్తుంటారు చాలా మంది. చిన్న పిల్లల బట్టలను శుభ్రం చేయడానికి అస్సలు ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల మీ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.
 


లోదుస్తులతో.. 

ఇంటిని ఎప్పుడూ కూడా మీరు వాడేసిన లో దుస్తులతో శుభ్రం చేయకూడదు. నిజానికి లో దుస్తుల్లో ఉండే ఎనర్జీ లెవల్స్ అంత మంచివి కాదు. దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఏదేమైనా బట్టల పరిమాణం, ఆకారం కూడా దుమ్ము ధూళిని లేదా  ఇంటిని శుభ్రపరచడం సాధ్యం కాదు.

మరణించిన వ్యక్తి బట్టలతో.. 

సాధారణంగా ఎవరైనా మరణిస్తే అతని దుస్తులను వేరేవాళ్లు అస్సలు ఉపయోగించరు. వీటిని పనికిరాని వాటిలాగే భావిస్తారు. అందుకే చాలా మంది చనిపోయిన వారి దుస్తులను ఎక్కువగా ఇంట్లో దుమ్ము లేదా వైప్స్ మొదలైన వాటికి ఉపయోగిస్తుంటారు. కానీ మరణించిన వారి దుస్తులను ఉపయోగించకూడదు. వాస్తు శాస్త్రంలో.. మరణించిన వ్యక్తి దుస్తులతో ఇంటిని శుభ్రం చేయడం శ్రేయస్కరం కాదు. 
 


సింథటిక్ దుస్తులతో.. 

సింథటిక్ దుస్తులతో కూడా ఇంటిని క్లీన్ చేయడం మంచిది కాదు. మీరు వీటితో  ఇంటిని తుడిచినప్పుడు అప్పుడు అవి ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ అవుతాయి. ఇది ఇంటి వస్తువులకు మంచిది కాదు. ముఖ్యంగా అలాంటి వస్త్రాన్ని ఉత్తర, తూర్పు దిశల్లో శుభ్రపరచడానికి ఉపయోగిస్తే అది నెగిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. దీంతో మీరు చేపట్టే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇది మీ ఇంట్లో విభేదాలను కలిగిస్తుంది. మార్కెట్ లో దుమ్ము, ధూళి వేయడానికి, ఇంటిని శుభ్రం చేయడానికి లేదా తుడుచుకోవడానికి అందుబాటులో ఉన్న దుస్తులను విడిగా ఉపయోగిస్తేనే మంచిది.

Latest Videos

click me!