`భారతీయుడు 2` ట్రైలర్‌ అప్‌ డేట్‌‌.. విజయ్‌ ఆంటోని `తుఫాన్‌` నుంచి అదిరిపోయే సాంగ్‌

By Aithagoni RajuFirst Published Jun 21, 2024, 7:51 PM IST
Highlights

కమల్‌ హాసన్‌ నుంచి వస్తోన్న లేటెస్ట్ మూవీ `భారతీయుడు 2`.ఈ మూవీ ట్రైలర్‌ డేట్‌ వచ్చింది. అలాగే విజయ్‌ ఆంటోని నటిస్తున్న `తుఫాన్‌` మూవీ అదిరిపోయే రెండో పాట వచ్చింది.
 

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నుంచి వస్తోన్న ప్రతిష్టాత్మక మూవీ `భారతీయుడు 2`. శంకర దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో, ఇప్పటికే వచ్చిన `భారతీయుడు` సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేటి సమాజంలో ఉన్న సమస్యలను, అవినీతిని, మూఢ విశ్వాసాలను చర్చించే కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నారు శంకర్‌. కమల్‌ `సేనాపతి`గా మరోసారి విశ్వరూపం చూపించేందుకు వస్తున్నారు. ఇందులో కాజల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే నెలలో విడుదల కానుంది. 

ఈ క్రమంలో సినిమా నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చింది టీమ్‌. ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ నెల 25న ట్రైలర్‌ని రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ముంబయిలోఈవెంట్‌ నిర్వహించి ట్రైలర్‌ని విడుదల చేస్తారట. ఈ ట్రైలర్‌ నిడివి రెండు నిమిషాల 36 సెకన్లు ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీకి ఇప్పటి వరకు పెద్దగా హైప్‌ రాలేదు. ఈ నేపథ్యంలో ట్రైలర్‌తో హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తుంది టీమ్‌. ఇక ముంబయితోపాటు హైదరాబాద్‌లోనూ ఓ ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నారట. పాన్‌ ఇండియాగా దీన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక సినిమాని జులై 10న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు 

Latest Videos


విజయ్ ఆంటోనీ `తుఫాన్` నుంచి సెకండ్‌ సింగిల్‌.. 

హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `తుఫాన్`. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా `రాఘవన్`, `హత్య` సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో `తుఫాన్` సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. `తుఫాన్ సినిమాను త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ రోజు సెకండ్ సింగిల్ 'వెతికా నేనే నా జాడే' రిలీజ్ చేశారు. 

'వెతికా నేనే నా జాడే' పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. మాష్మి నేహా పాడారు. హరి దఫూషియా సంగీతాన్ని అందించారు. ' వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో..నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పి పోయా గాలై సాగుతూ.. కాలం కరిగిపోయే తీరం చేరుతూ' అంటూ ఆలోచింపజేసే లిరిక్స్ తో సాగుతుందీ పాట. ఈ సినిమాకు ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.ఇక సినిమాని త్వరలోనే విడుదల చేయబోతున్నారు.  ఇందులో విజయ్‌ ఆంటోనీోపాటు శరత్‌ కుమార్‌, సత్యరాజ్‌, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్‌, మురళీ శర్మ, పృథ్వీ అంబర్‌, శరణ్య పొన్వన్నన్‌, తలైవాసల్‌ విజయ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  
 

click me!