ముసలి హీరోలతో రొమాన్స్ చేస్తూంటే ఆ ఫీల్ ...నాగ్ హీరోయిన్ నాటీ కామెంట్స్

First Published Jun 23, 2024, 9:02 AM IST

 నాగార్జునతో కలిసి ‘చంద్రలేఖ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ‘ప్రేమతో రా’ అనే మూవీలోనూ కనిపించింది. 

Isha Koppikar


కొందరు కొట్టినట్లున్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద మాట్లాడేస్తారు. అలాంటి వాళ్లలో ఒకరు ఇషా కొప్పికర్. నటిగా ఆమె వెలుగు పెద్దగా లేదు కానీ స్టార్ కుటుంబం నుంచి నటిగా ఆమెకు ఎప్పుడూ ఏదో ఆఫర్ వస్తూనే ఉంటుంది. దాంతో  టాలీవుడ్, బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలలో నటిగా ఇషా కొప్పికర్ (Isha Koppikar) సినిమాలు చేస్తూనే ఉంది.  తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోకపోయినా ఒక టైమ్ లో బాలీవుడ్ లో వరస సినిమాలు చేసింది. అయితే ఆమెకు వచ్చిన ఆఫర్స్ లో ఎక్కువ శాతం సీనియర్ హీరోలతోనే. అప్పుడు చక్కగా డబ్బులు కోసం నటించిన ఆమె ఇప్పుడు ముసలి హీరోలతో రొమాన్స్ చేసేనే అని ఫీలైపోతోంది. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


ఇషా కొప్పికర్ తెలుగు తో పాటు నార్త్ లోనూ పలు సినిమాలు చేసింది. తెలుగు, తమిళం, కన్నడతో పాటు హిందీలోనూ హీరోయిన్ గా రాణించింది. ‘W/o వర ప్రసాద్’ సినిమా అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో కేవలం ఆమె ఓ పాట మాత్రమే చేసింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి ‘చంద్రలేఖ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ‘ప్రేమతో రా’ అనే మూవీలోనూ కనిపించింది. ఆమె చివరగా తెలుగులో ‘కేశవా’ అనే సినిమాలో నటించింది. తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఆమె, ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది.   

Latest Videos



ఇషా కొప్పికర్ కెరీర్ లో ఎక్కువ శాతం సినిమాలు చేసి బిజిగా ఉంది పాతికేళ్ల క్రితం అంటే 2000లో. అప్పటికి ఉంటే స్టార్స్ పెద్దవాళ్లు వయస్సులో . వాళ్లకు యంగ్ హీరోయిన్ కావాల్సి వచ్చి ఈమెను తీసుకునేవారు. ఆ సినిమాలు ఆడేవి కూడా. అయితే వయస్సు అయ్యిపోయిన హీరోలతో రొమాన్స్ చాలా ఇబ్బందికరంగా ఉండేదని ఇప్పుడు వాపోతోందని ఇషా. ఆ రోజులు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుందిట. 


బాలీవుడ్ మీడియా సంస్దకు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మాట్లాడుతూ...సునీల్ శెట్టితో ప్యార్ ఇష్ట్ అవుర్ మొహబ్బత్, గోవిందా తో ఆమ్దానీ అర్దానీ కర్చు రూపాయా  వంటి సినిమాలు చేసానని అవి బాగా ఆడాయని అంది. అయితే తనకన్నా ఇరవై నుంచి ముప్పై ఏళ్లు పెద్ద హీరోలు వాళ్లు అని. వాళ్లతో చేయటం అంటే చాలా చాలా ఇబ్బంది అనిపించేది అని చెప్పుకొచ్చింది.


ఇక సీనియర్ హీరోలతో చేసేటప్పుడు వాళ్లను ఓ లవర్ గానో, లేక పార్టనర్ గానో కౌగలించుకోవాలన్నా ఆ  ఫీల్ రాదు. మీ నాన్నను కౌగలించుకున్నట్లు ఉంటుంది. ఇంకేమీ రొమాన్స్ మన కళ్లలో ,శరీరంలో పలుకుతుంది. ఇది నార్మల్ , నేను కొత్తదాన్ని కాబట్టి నాకు అలా అనిపిస్తోంది అనుకునేదాన్ని. 

Isha Koppikar


అయితే తర్వాత కాలంలో నేనొక నటిని, మిగతావన్ని మర్చిపోయి పాత్రను బట్టి బిహేవ్ చేయాలని తెలుసుకున్నాను. కొంతమంది హీరోలు వయస్సు అయ్యిపోయినా శరీరాన్ని జాగ్రత్తగా ఫిట్ గా మెయింటైన్ చేసేవారు. కొందరిలో అదీ ఉండేది కాదు. అలాగే బిహేవియర్ కూడా కొందరు తమ వయస్సుకు తగ్గట్లు గౌరవంగా ప్రవర్తించేవారు. మరికొందరు వయస్సు ఎలా ఉన్నా కుర్రాళ్లులా ఫీలయ్యేవారు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ హీరోల అభిమానులను హర్ట్ చేస్తున్నాయి. అంత ఇబ్బందిగా ఉంటే వాళ్లతో చేయనని చెప్పేయలేకపోయావా అని విమర్శిస్తున్నారు. 


ఇదిలా ఉంటే  క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇషా కొప్పికర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.  నాకు 22 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఒక స్టార్ హీరో ఒంటరిగా ఇంటికి రమ్మని పిలిచాడని ఆమె తెలిపారు. కెరీర్ తొలినాళ్లలోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని ఇషా పేర్కొన్నారు. తనను ఇంటికి పిలిచిన ఆ పెద్ద నటుడికి కొన్ని ఎఫైర్లు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
 

Isha Koppikar


ఇక ఆ హీరో  ...నా స్టాఫ్ వస్తే గాసిప్స్ పుట్టిస్తారని అందువల్ల ఒంటరిగా రావాలని  నాకు సూచించాడని ఇషా కొప్పికర్ పేర్కొన్నారు. నేను దానికి ఒప్పుకోలేదని ఒంటరిగా రాలేనని చెప్పేశానని ఆమె చెప్పుకొచ్చారు. అతడి పేరు చెప్పడానికి మాత్రం ఇషా కొప్పికర్ ఇష్టపడలేదు. 18 సంవత్సరాల వయస్సులో సైతం ఈ తరహా అనుభవం ఒకటి ఎదురైందని ఆమె పేర్కొన్నారు. హీరో సెక్రటరీ నా దగ్గరికొచ్చిందని హీరోతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పిందని ఆమె తెలిపారు.
 


నేను ఫ్రెండ్లీగానే ఉంటానని సెక్రటరీకి బదులిచ్చానని ఇషా కొప్పికర్ పేర్కొన్నారు. ఆ సమయంలో సెక్రటరీ నిన్ను ఎవరైనా అభ్యంతరకరంగా తాకారా అని అడగగా లేదని చెప్పానని ఆమె అన్నారు. హీరో అలా తాకినా కూడా సర్దుకోవాలని సెక్రటరీ చెప్పిందని ఇషా కొప్పికర్ వెల్లడించారు. ఆ సమయంలో అలాంటి ఫ్రెండ్లీ నేచర్ నాకు లేదని చెప్పానని ఆమె పేర్కొన్నారు.
 

Isha Koppikar

 “సినిమా పరిశ్రమలోని హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తమ సినిమాలో ఎవరు నటించాలి అనే విషయాన్ని కూడా వాళ్లు ప్రభావితం చేస్తారు. తమ మూవీలో సెలెక్ట్ చేసిన హీరోయిన్లను కమిట్మెంట్ కోసం ఒత్తడి చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది హీరోయిన్లు వారి ఒత్తిడి తట్టుకోలేక సినిమా నుంచే కాదు, ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న వాళ్లు ఉన్నారు. నా లాంటి కొంత మంది ఆ ఒత్తిళ్లను తట్టుకుని మరీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు” అని చెప్పుకొచ్చింది.

click me!