‘కల్కి’ టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు భారీగానే..

First Published Jun 23, 2024, 9:44 AM IST

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. 

Kalki


పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే టిక్కెట్ ధరలు పెంచటం, అందుకు ప్రభుత్వాలు ఫర్మిషన్ ఇవ్వటం యాజ్ యూజవల్ గా జరిగిపోతోంది. తాజాగా కల్కి చిత్రానికి సైతం తెలంగాణా ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చింది.  సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఈ క్రమంలో టిక్కెట్ రేట్లు ఎంత పెంచారు. మల్టిప్లెక్స్ లలో ఏ రేటు, సింగిల్ స్క్రీన్స్ లో ఏ రేటు అనేది చూద్దాం. 

Kalki 2898 AD


ప్రస్తుతం ఇండియా వైడ్‌గా 'కల్కి 2898 AD' మేనియానే కనిపిస్తున్న సంగతి తెలిసిందే.  రీసెంట్ గా  విడుదలైన రిలీజ్‌ ట్రైలర్‌ తో ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని రీచ్ అయ్యాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా అదిరిపోయే  బజ్‌ క్రియేట్‌ చేస్తోంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌,   నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో పాన్‌ వరల్డ్‌ తెరకెక్కిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కావటంతో రిజల్ట్ ఎలా ఉండబోతోందనే విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అత్యంత భారీ బడ్జెట్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందిన కల్కి జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతుంది. మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మూవీ టీం రోజురోజుకు ఒక్కొక్క అప్డేట్‌ వదుతూ మూవీపై బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.  అంతా బెనిఫిష్ షోలు కోసం ఎదురుచూస్తున్నారు. 

Latest Videos



ఈ నేఫధ్యంలో ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజుల పాటు టికెట్‌ ధరలు (kalki 2898 ad tickets price) పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్‌ దరఖాస్తు చేసుకుంది. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్‌పై గరిష్ఠంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 

 
సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5.30 గంటల షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. 

Kalki Trailer


ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్స్ లో రెగ్యులర్ షోలకు 265/-, మల్టి ప్లెక్స్ లలో 413/- కానుంది. ఇక అఫీషియల్ బెనిఫిట్ షో ప్రైస్ ..సింగిల్ స్క్రీన్స్ కు 377/-, మల్టిప్లెక్స్ లలో  495/- గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.  మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ‘కల్కి’ టికెట్‌ ధరలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
  


ప్రభాస్‌ అభిమానుల కోసం ‘కల్కి’ బెనిఫిట్‌ షోలను ప్రదర్శించాలని చిత్ర టీమ్  భావిస్తోంది. ఇందుకు సంబంధించిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతులు తీసుకోటోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని రూ.140కోట్లకు విక్రయించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘కల్కి’ సేఫ్‌ జోన్‌లో ఉండాలంటే కనీసం రూ.120కోట్లు వసూలు చేయాలి. 

భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఎగస్ట్రా షోలతో పాటు, మొదటి వారం లేదా, కనీసం వీకెండ్‌ వరకూ టికెట్‌ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించాలి. ఈ క్రమంలోనే తెలంగాణా గవర్నమెంట్ ఫర్మిషన్ ఇచ్చింది. ఈ రోజో ,రేపో ఆంధ్రా గవర్నమెంట్ ఫర్మిషన్ ఇస్తుంది. 
 


మరోవైపు విదేశాల్లో ‘కల్కి’ టికెట్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. అమెరికా, యూకేలో బుకింగ్స్‌ విషయంలో విశేష ఆదరణ లభిస్తున్నట్లు చిత్ర టీమ్  చెబుతోంది. ఐమ్యాక్స్‌ 3డీ వెర్షన్‌తో పాటు, యూకేలోని కొన్ని థియేటర్స్‌లో 4డీలోనూ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇప్పటికే ముంబయిలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించగా, త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇందుకోసం సరైన వేదికను అన్వేషిస్తున్నారు. తొలుత ఏపీలో ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని భావించినా, దీనిపై స్పష్టత రాలేదు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ప్రభాస్‌ అభిమానులను అలరించేలా భారీగా ఈవెంట్‌ను ప్లాన్‌ చేసే అవకాశం ఉన్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ ఈవెంట్‌లోనే ‘కల్కి’ సెకండ్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నాను.
 

ఈ మూవీ తెలుగు సెన్సార్‌ పూర్తయింది. సినిమా రన్‌టైన్‌ 180.56 నిమిషాలు. కొన్ని డిస్‌క్లైమర్స్‌ను జత చేయాల్సింది సీబీఎఫ్‌సీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సర్టిఫికేషన్‌) సూచించింది. మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. ఇటీవల కాలంలో మూడు గంటలకు అటు, ఇటుగా పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడమే కాదు, మంచి విజయాలను అందుకున్నాయి.

‘కల్కి’లాంటి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలకు ఇదంత కష్టమేమీ కాదు. ఈ విషయంలో చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది.  తాను అనుకున్న కథ ప్రకారం... దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మూవీని తీయగా, ఫుటేజ్‌ మొత్తం దాదాపు నాలుగున్నర గంటలు వచ్చిందని సమాచారం.

ప్రేక్షకులు చూసేందుకు వీలుగా కథ, కథనాలు దెబ్బతినకుండా సినిమా రన్‌టైమ్‌ను 3గంటలకు తీసుకొచ్చారు. ప్రేక్షకుడు థియేటర్‌లో అడుగు పెట్టిన తర్వాత సరికొత్త ఊహా ప్రపంచంలోకి వెళ్లడం ఖాయమని చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

click me!