ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ... అప్పట్లో వీరు సినిమాకు ఎంత రెమ్యునరేషన్స్ తీసుకునే వాళ్లో తెలుసా?

First Published Mar 23, 2024, 3:27 PM IST

రెమ్యునరేషన్... ఈతరం హీరోలకు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. క్రేజ్, మార్కెట్ ను బట్టి పారితోషికాలు ఊహించని స్థాయిలో ఉంటున్నాయి. అయితే టాలీవుడ్ తొలితరం హీరోలకు ఎలా రెమ్యునరేషన్స్ ఇచ్చే వారో తెలుసుకుందాం.

టాలీవుడ్ (Tollywood) తొలితరం హీరోలు తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఒకే ఏడాది మల్టీపుల్ చిత్రాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే.

అయితే అలనాటి హీరోల్లో ఎన్టీఆర్ (NTR), ఏఎన్నార్ (ANR), కృష్ణ (Krishna)  ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే. వారి నటన, వ్యక్తిత్వం, సేవాగుణంతో ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వందల సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో వీరు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకునే వారో చాలా మందికి తెలిసి ఉండదు.

అప్పట్లో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆ సమయంలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు కూడా ఎన్టీఆర్ వే. దీంతో ఒక్కో సినిమాకు ఎన్టీఆర్ రూ.12 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునే వారంట.

నటసామ్రాట్, అక్కినేని నాగేశ్వర్ రావు కూడా అప్పటి పరిస్థితుల్లో అత్యధిక రెమ్యునరేషనే అందుకున్నారు. ఆయనకు మంచి గుర్తింపు వచ్చాక సినిమాకు రూ.10 లక్షల వరకు తీసుకున్నారంట. సినిమా బడ్జెట్ తగ్గితే రెమ్యునరేషన్ కూడా తగ్గించేవారట.

తెలుగు ప్రేక్షకులకు సూపర్‌స్టార్‌గా కొనసాగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు కృష్ణ.  టాలీవుడ్‌లో ఈయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇక మన కృష్ణ సినిమాకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రెమ్యునరేషణ్ పొందారు. 

click me!