రవితేజ పక్కన హీరోయిన్‌గా అన్నారు.. కట్‌ చేస్తే రాత్రికి రాత్రి హీరోయిన్‌ ని మార్చేశారు.. బాంబ్‌ పేల్చిన దివి

Published : Mar 18, 2024, 05:12 PM ISTUpdated : Mar 18, 2024, 05:13 PM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి వాద్త్యా.. షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది. రవితేజ పక్కన హీరోయిన్‌గా ఆఫర్‌ ఇచ్చి రాత్రి రాత్రి హీరోయిన్‌ ని మార్చేశారంటూ బాంబ్‌ పేల్చింది.   

PREV
16
రవితేజ పక్కన హీరోయిన్‌గా అన్నారు.. కట్‌ చేస్తే రాత్రికి రాత్రి హీరోయిన్‌ ని మార్చేశారు.. బాంబ్‌ పేల్చిన దివి

బిగ్‌ బాస్‌ బ్యూటీ దివి.. ఇటీవల `లంబసింగి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. హీరోయిన్‌గా మెప్పించింది. తానుకూడా హీరోయిన్‌గా చేయగలను అనే విషయాన్ని చాటి చెప్పింది. మేకర్స్ కి ఆ సందేశాన్ని పంపించింది. అదే సమయంలో దివి పేరు ఇప్పుడు మరింతగా వినిపిస్తుంది. తాను హీరోయిన్‌గా అయినా, నటిగా కీలక పాత్రల్లో అయినా సినిమాలు చేస్తానని, పలు మంచి ప్రాజెక్ట్ లు తనకు వస్తున్నట్టు చెప్పింది దివి.  
 

26

ఈ క్రమంలో ఆమె ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. మాస్‌ మహారాజా రవితేజ పక్కన హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని, కానీ రాత్రికి రాత్రి హీరోయిన్‌ని మార్చేశారని తెలిపింది దివి. తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె పలు యూట్యూబ్‌ ఛానెల్స్ తో ముచ్చటించింది. ఇందులో ఆమె అనేక విషయాలను పంచుకుంది.
 

36

హరీష్‌ శంకర్‌ గురించి చెబుతూ, ఆయన తనకు మంచి స్నేహితుడని, సపోర్టివ్‌, మెంటర్‌ అని పేర్కొంది. ఆస్కార్‌ విన్నింగ్‌ కెమెరామెన్‌ రిచర్డ్ హైదరాబాద్‌ వచ్చినప్పుడు హరీష్‌ శంకర్‌ తీస్తున్న సినిమా సెట్‌కి ఆయన్ని తీసుకెళ్లానని, ఆసమయంలో ఎంతో బాగా చూసుకున్నారని, ఆ టైమ్‌లోనే పరిచయం ఏర్పడిందని, తనని ఎంతో బాగా చూసుకుంటారని, సపోర్ట్ చేస్తారని తెలిపింది దివి.

46

హీరోయిన్‌గా ఆయన సినిమాల్లో అవకాశాల గురించి చెబుతూ, ఆయన ఏ పాత్ర చేయమన్నా చేస్తానని తెలిపింది. ప్రస్తుతం రవితేజతో చేస్తున్న సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నట్టు తెలిపింది. హరీష్‌ శంకర్‌ తనని హీరోయిన్‌గా చేయమన్నా చేస్తానని, ఇతరపాత్రలు చేయమన్నా చేస్తాను, లేదు దీనికి వద్దు అంటూ ఊరుకుంటానని చెప్పింది.
 

56

ఇందులో రవితేజతో ఆఫర్‌ గురించి తెలిపింది. అంతకు ముందు రవితేజతో హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చిందట. హీరోయిన్‌గా రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ఎంపిక చేశారట. అంతా ఫైనల్‌ అయ్యింది. దీంతో తన ఆనందానికి అవదుల్లేవని, రాత్రి కూర్చొని స్పీచ్‌ రాసుకుందట. కానీ కట్‌ చేస్తే తెల్లారే సరికి హీరోయిన్‌ మారిపోయిందట. తనని తీసేసి వేరే అమ్మాయిని తీసుకున్నారట. అది తనని బాగా డిజప్పాయింట్‌ చేసిందని తెలిపింది దివి. 
 

66

హీరోయిన్‌గా ఆఫర్‌ అంటే అంత ఈజీ కాదని, ఒక్క దర్శకుడికి మాత్రమే నచ్చితే సరిపోదని, టీమ్‌కి సంబంధించిన ఓ పది, ఇరవై మందికి నచ్చాల్సి ఉంటుందన్నారు. అందరికి నచ్చేలా మనం ఉండాలని, అప్పుడే అవకాశం వస్తుందని తెలిపింది దివి. మున్ముందు మరిన్ని మంచి సినిమాల్లో భాగం కాబోతున్నట్టు తెలిపింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories