నిరుద్యోగులకు ఎస్బీఐ శుభవార్త.. 12,000 ఖాళీల భర్తీకి రంగం సిద్దం..  

By Rajesh KarampooriFirst Published May 9, 2024, 10:19 PM IST
Highlights

నిరుద్యోగ యువతకు దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త అందించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఇతర కేటగిరీల్లో దాదాపు 12,000 మంది ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియ సాగుతుందని తెలిపింది.

నిరుద్యోగ యువతకు శుభవార్త. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) దాదాపు 12,000 మంది ఉద్యోగులను నియమించుకునే సిద్దంగా ఉంది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT), ఇతర విధుల్లో ఉద్యోగులుగా నియమించేందుకు సిద్దంగా ఉన్నామని చైర్మన్ దినేష్ ఖరా వెల్లడించారు.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన ఎస్బీఐలో 2,32,296 మంది ఉద్యోగులున్నారనీ, ఇది గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,35,858గా ఉండేదని తెలిపారు. ఈ క్రమంలో సుమారు 11,000 నుండి 12,000 మంది ఉద్యోగులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైందని చైర్మన్ తెలిపారు.

వీరు సాధారణ ఉద్యోగులు, కానీ వాస్తవానికి మా అసోసియేట్ స్థాయిలో,  అధికారుల స్థాయిలో, వారిలో 85 శాతం మంది రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఉందని ఖరా తెలిపారు.  అలాగే..స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ..  Q4FY24లో నికర లాభం 24 శాతం పెరిగి రూ.20,698 కోట్లకు చేరుకుందని తెలిపారు. 
 

click me!