ఎముకలు కొరికే చలిలో అషురెడ్డి హొయలు.. భరిస్తూనే ఫోటో షూట్, వైరల్

First Published May 9, 2024, 10:41 PM IST

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. 

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. 

బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతోంది. 

గతంలో అషురెడ్డి పర్సనల్ లైఫ్ పై చాలా రూమర్స్ వచ్చాయి.సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి లవ్ ఎఫైర్ సాగిస్తోందని గతంలో ప్రచారం జరిగింది. 

ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతని ఆకర్షిస్తోంది. అషురెడ్డి ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. పనిలో పనిగా అక్కడ అందమైన ప్రదేశాల్లో ఫోటో షూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

తాజాగా అషురెడ్డి స్విస్ లో గడ్డ కట్టే చలిలో చీర కట్టులో మెరిసింది. చలి ఇరగదీస్తోంది అంటూనే అందంగా ఫోజులు ఇచ్చింది. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

అషురెడ్డి లేటెస్ట్ ఫొటోస్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అంతః చలి ఉన్నప్పుడు స్వెటర్ వేసుకోవచ్చుగా.. ఫోటో షూట్స్ చేయడం ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!