IPL 2024: డూ ఆర్ డై మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్‌ నుంచి పంజాబ్‌ ఔట్‌..

By Rajesh Karampoori  |  First Published May 10, 2024, 12:29 AM IST

IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 60 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ధర్మశాలలో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ జట్టు 17 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది.


IPL 2024: ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం వేదికగా  పంజాబ్‌, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యం చేధనకు వచ్చిన పంజాబ్ జట్టు తడబడింది. 17 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో పంజాబ్ జట్టు ఐపీఎల్ 2024 నుంచి నిష్క్రమించింది.

12 మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టుకు కేవలం ఎనిమిది పాయింట్లు ఉన్నాయి. కానీ ఈ పాయింట్లు ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి సరిపోవు.  ఫ్లే ఆఫ్ కు చేరుకోవాలంటే.. జట్టు కనీసం 12 పాయింట్లు ఉండాలి. ముంబై తర్వాత ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన రెండో జట్టు పంజాబ్.

Latest Videos

అదే సమయంలో.. RCB ఈ విజయంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 12 మ్యాచ్‌ల తర్వాత ఆర్సీబీకి 10 పాయింట్లే ఉన్నాయి. కానీ, ఇతర జట్ల ఫలితాలపై ఆర్సీబీ ఫ్లేఆఫ్ చేసుకునే అవకాశాలు ఆధారపడాల్సి వస్తుంది. బెంగళూరు తర్వాతి రెండు మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నాయి. అందులో తొలుత మే 12న ఢిల్లీ క్యాపిటల్స్‌తో.. మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆ జట్టు ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్ ల్లో ఆర్సీబీ కచ్చితంగా గెలువాల్సి ఉంటుంది.  

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు. ఇక రజత్ పాటిదార్ 23 బంతుల్లో 55 పరుగులు, కామెరాన్ గ్రీన్ 27 బంతుల్లో 46 పరుగులు చేశారు.

అనంతరం పంజాబ్ జట్టు 17 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. రిలే రూసో, శశాంక్ సింగ్ తప్ప వేరే ఆటగాళ్లు రాణించలేకపోయారు.  రిలే రూసో అత్యధిక స్కోరు 61 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్ 37 పరుగులు, సామ్ కుర్రాన్ 22 పరుగులు చేయగలిగారు. ఇక ఆర్సీబీ బౌలర్లు సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. స్వప్నిల్ సింగ్, లోకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.

click me!