Virat Kohli: కోహ్లి నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు!

By Rajesh Karampoori  |  First Published May 9, 2024, 11:56 PM IST

Virat Kohli: పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు. ఈ తరుణంలో శతకం చేజారిన ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. నయా రికార్డులు క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ రికార్డులేంటీ? 


Virat Kohli: పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు. కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో RCB పంజాబ్‌కు 242 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ అరుదైన క్రియేట్ చేశారు. అదే.. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ 2024లో 600 పరుగులు పూర్తి చేసిన ఘనత సాధించాడు. అలాగే.. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ ముందంజలో ఉన్నాడు. 

నాలుగోసారి 600+ పరుగులు 

Latest Videos

undefined

ఐపీఎల్ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేసిన ఫీట్‌ను కోహ్లీ నాలుగోసారి సాధించాడు. ఈ విషయంలో లక్నో సూపర్‌ జెయింట్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను సమం చేశాడు. ఐపీఎల్‌లో రాహుల్, కోహ్లి తలా నాలుగు సార్లు 600కు పైగా పరుగులు చేశారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ గా రికార్డు క్రియేట్ చేశారు. వీరితో పాటు, RCB తరపున ఆడిన క్రిస్ గేల్, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న డేవిడ్ వార్నర్ IPLలో మూడుసార్లు 600+ పరుగులు సాధించారు. అదే సమయంలో RCB కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్  రెండుసార్లు 600 ఫ్లస్ పరుగులు చేశారు. 

 చేజారిన సెంచరీ..  

ఈ మ్యాచ్‌లో కోహ్లీకి రెండుసార్లు లైఫ్ లభించింది. కోహ్లి ఒకసారి ఖాతా తెరవకుండానే ఔట్ కాకుండా తప్పించుకోగా, రెండోసారి 10 పరుగుల స్కోరు వద్ద క్యాచ్ మిస్సాయింది. ఇలా రెండు సార్లు లైఫ్ దొరకడంతో కోహ్లి .. పరుగుల వరద పారించారు. సెంచరీ పూర్తి చేస్తాడని అనిపించినా .. కోహ్లీ తన వ్యక్తిగత స్కోర్ 92 పరుగులు వద్ద  రిలే రూసో బౌలింగ్ లో అర్ష్‌దీప్ సింగ్ కు క్యాచ్ ఇచ్చిన ఫేవిలియన్ దారి పట్టారు. ఇలా సెంచరీ వద్ద కోహ్లీ అవుట్ కావడం తొమ్మిదో సారి. ఐపీఎల్‌లో కోహ్లీ  90- 100 పరుగుల మధ్య అవుట్ కావడం ఇది రెండోసారి. అంతకుముందు 2013లో ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల వద్ద అవుటయ్యాడు.
 
ఆ మూడు జట్లపై 1000+ పరుగులు 

ఈ మ్యాచ్‌లో కోహ్లీ తన పేరిట ఎన్నో రికార్డులు సృష్టించాడు. తన అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ తో కోహ్లి పంజాబ్ కింగ్స్‌పై 1000 పరుగులు పూర్తి చేసిన ఘనతను కూడా సాధించాడు. ఐపీఎల్‌లో కోహ్లీ ఇప్పటి వరకు మూడు జట్లపై 1000+ పరుగులు చేశాడు. పంజాబ్‌తో పాటు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా కోహ్లి వెయ్యికి పైగా పరుగులు పూర్తి చేశాడు. అత్యధిక జట్లపై 1000+ పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరిట ఉంది. ఈ విషయంలో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లను వెనకేసుకొచ్చాడు. రోహిత్ శర్మ.. ఢిల్లీ, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 1000+ పరుగులు సాధించగా, వార్నర్.. KKR,  పంజాబ్ కింగ్స్‌పై 1000+ పరుగులు చేశాడు.
 

click me!