బాలీవుడ్ హీరోయిన్ దియా మిర్జా తనపై వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై స్పందించారు. తాను కెరీర్ లో ఎప్పుడు నిషేధిత డ్రగ్స్ వాడలేదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో ద్వారా మీడియాలో వస్తున్న కథనాలకు సమాధానం ఇచ్చారు.
దియా మీర్జా తన ట్వీట్ లోకొందరు తనపై ఉద్దేశపూర్వకంగాఇలాంటి నిరాధారణఆరోపణలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. చేస్తున్న ఆరోపణలలో వస్తున్న కథనాల్లో నిజం లేదని అన్నారు.
ఇలాంటి ఆరోపణల కారణంగా ఏళ్లుగా నిర్మించుకున్నతన కెరీర్నాశనం అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కస్టపడినిర్మించుకున్న కెరీర్ని ఇలా నాశనం చేయడం సరికాదు అన్నారు.
కెరీర్ లో ఎన్నడూ నిషేధిత ఉత్రేరకాలను వాడడం కానీ, కొనడం కానీ చేయలేదని అన్నారు. చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడలేదని దియా మీర్జా చెప్పడంతో పాటు తనకు మద్దతుగా నిలిచిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెఈ కేసులోఇరుక్కునేలా కనిపిస్తుంది. అధికారుల విచారణలో జయ సాహాదీపికా పేరు చెప్పారని చెప్పడం సంచలనం రేపుతోంది. దీపికా మేనేజర్ కి ఇప్పటికే అధికారులు నోటీసులు ఇచ్చారు.