MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • `కార్తీకదీపం` నిరుపమ్‌ నటించిన సినిమాలేంటో తెలుసా? ఏకంగా పాన్ ఇండియా స్టార్ మూవీలో

`కార్తీకదీపం` నిరుపమ్‌ నటించిన సినిమాలేంటో తెలుసా? ఏకంగా పాన్ ఇండియా స్టార్ మూవీలో

`కార్తీకదీపం` ఫేమ్‌ నిరుపమ్‌ పరిటాల సీరియల్స్ ద్వారా స్టార్ గా ఎదిగారు. కానీ ఆయన సినిమాల్లో కూడా నటించారు. అందులో ఒకటి పాన్‌ ఇండియా స్టార్‌ మూవీ కూడా ఉండటం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 25 2025, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`కార్తీకదీపం`తో స్టార్‌గా రాణిస్తున్న నిరుపమ్‌ పరిటాల
Image Credit : Asianet News

`కార్తీకదీపం`తో స్టార్‌గా రాణిస్తున్న నిరుపమ్‌ పరిటాల

`కార్తీకదీపం` సీరియల్‌లో డాక్టర్‌ బాబుగా పాపులర్‌ అయి బుల్లితెర స్టార్‌గా రాణిస్తున్నాడు నటుడు నిరూపమ్‌ పరిటాల. ఆయన అనేక సీరియల్స్ లో నటించి మెప్పించాడు. సీరియల్‌ నటుడిగా స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే బుల్లితెర ద్వారా సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న నటుడు కూడా ఆయనే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నిరుపమ్‌ కి మహిళల నుంచి లేఖలు
Image Credit : Asianet News

నిరుపమ్‌ కి మహిళల నుంచి లేఖలు

`కార్తీకదీపం` సీరియల్‌లోని సీన్లని చూసి చాలా మంది మహిళలు నిజంగానే ఆయన్ని నిలదీశారు. వంటలక్కని ఇబ్బంది పెట్టిన సీన్లు నిజమే అని భావించి ఏకంగా నిరుపమ్‌కి లెటర్స్ కూడా రాశారట. స్మాల్‌ స్క్రీన్‌ని శాషిస్తున్న నిరుపమ్‌ పరిటాల సినిమాల్లో కూడా నటించాడు. అందులో ఒకటి పాన్‌ ఇండియా హీరో సినిమా కూడా ఉండటం విశేషం.

35
నిరూపమ్‌ నటించిన సినిమాలివే
Image Credit : Asianet News

నిరూపమ్‌ నటించిన సినిమాలివే

నిరూపమ్‌ నిజానికి హీరో కావాలనే సినిమాల్లోకి వచ్చాడు. మొదటి కొన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ వర్కౌట్‌ కాలేదు. ఆఫర్లు రాలేదు. దీంతో ఒకటి రెండు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. అలా అల్లరి నరేష్‌ నటించిన `ఫిట్టింగ్‌ మాస్టర్`లో చిన్న పాత్రలో మెరిశాడు. ఇది 2009లో విడుదలైంది. ఇది బాగానే ఆడినా, నిరుపమ్‌కి పేరు రాలేదు.

45
ఎన్టీఆర్‌ `రభస`లో నిరుపమ్‌ నెగటివ్‌ రోల్‌
Image Credit : google

ఎన్టీఆర్‌ `రభస`లో నిరుపమ్‌ నెగటివ్‌ రోల్‌

దీంతోపాటు ఓ వైపు సీరియల్స్ నటిస్తూనే ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్న ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన `రభస`లోనూ నటించే ఆఫర్‌ని అందుకున్నాడు. అయితే ఇందులో నిరుపమ్‌ది నెగటివ్‌ రోల్‌ కావడం విశేషం. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో నిరూపమ్‌ కష్టం వృధా అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఆ వైపు సాహసం చేయలేదు నిరుపమ్‌. సీరియల్స్ ద్వారానే కావాల్సిన పేరు, ఇమేజ్‌ వస్తుండటంతో సినిమాలను లైట్‌ తీసుకున్నారు.

55
`కార్తీకదీపం2`తో నిరుపమ్‌ బిజీ
Image Credit : Asianet News

`కార్తీకదీపం2`తో నిరుపమ్‌ బిజీ

ప్రస్తుతం నిరూపమ్‌ వరుసగా సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆయన `కార్తీకదీపం 2` సీరియల్‌తో బిజీగా ఉన్నారు. నిరుపమ్‌ `చంద్రముఖి` సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీరియల్‌ అప్పట్లో విశేష ఆదరణ పొందింది. ఆ తర్వాత `బ్రహ్మముడి`, `హిట్లర్‌గారి పెళ్ళాం`, `కుంకుమపువ్వు`, `మూగమనసులు`, `కార్తీకదీపం`, `అత్తారింటికి దారేది`, `కలవారి కోడళ్లు`, `కాంచనగంగ`, `ప్రేమ`, `రాధకు నీవెర ప్రాణం` వంటి సీరియల్స్ లో నటించి ఆకట్టుకున్నాడు నిరుపమ్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Toxic OTT: టాక్సిక్ సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంత? ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Movie Costumes: సినిమాల్లో వాడే ఖరీదైన కాస్ట్యూమ్స్‌ను షూటింగ్ తర్వాత ఏం చేస్తారో తెలుసా?
Recommended image3
Nani: ఆడవాళ్లకు పెద్ద దండం.. జడ వేసుకోవడం ఇంత కష్టమా? నాని సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
తెలుగు చిత్ర పరిశ్రమకి పవన్‌ కళ్యాణ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. ఇకపై వారికి చుక్కలే
Recommended image2
చిరంజీవి దుర్మార్గుడు, సెట్‌లో రాక్షసత్వం చూపించారు.. మెగాస్టార్‌ని అసహ్యించుకున్న హీరో, పైగా అభిమాని కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved