చెవిలో చెప్పాల్సిన మేటర్ మైక్ లో చెబితే... తీవ్రరూపం దాల్చుతున్న చిరు-గరికపాటి వివాదం!

First Published Oct 7, 2022, 2:08 PM IST

చిలికిచిలికి గాలి వాన అన్నట్లు చిరంజీవి-గరికపాటి వివాదం తీవ్ర రూపం దాల్చుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గరికపాటిపై చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ప్రముఖులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

Chiranjeevi vs Garikapati

ప్రతి ఏడాదిలాగే బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అలై బలై వేడుక ఘనంగా ఏర్పాటు చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవికి కూడా పిలుపొచ్చింది. పెద్దల కోరిక మేరకు ఆయన అలై బలై వేడుకలో పాల్గొన్నారు.

Chiranjeevi vs Garikapati

కార్యక్రమం జరుగుతుండగా చిరంజీవితో ఫోటోలు దిగడానికి మహిళలు ఆసక్తి చూపించారు.  మహిళా అభిమానుల కోరిక కాదనలేక వాళ్లతో చిరంజీవి సెల్ఫీలు దిగుతున్నారు. ఆయన చుట్టూ ఆడవాళ్లు చేరగా సందడి వాతావరణం నెలకొంది. ఆ సమయంలో గరికపాటి నరసింహారావు మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగిస్తుండగా వేడుకకు హాజరైన ఆడవాళ్లు ఫోటోలు దిగడం ఆయనకు నచ్చలేదు. 
 

Chiranjeevi vs Garikapati

తన ప్రసంగానికి విలువ లేదన్న భావన ఆయనలో కలిగింది. వెంటనే రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారు ఆ ఫోటో షూట్ ఆపాలి. మీరు ఆపితే నేను ప్రసంగం మొదలుపెడతాను. లేదంటే వెళ్లిపోతానని ఓపెన్ గా మైక్ లో తన అసహనం బయటపెట్టారు. అది విన్న చిరంజీవి వెంటనే అక్కడ నుండి వచ్చేశారు. గరికపాటితో మాట్లాడారు. 
 

Chiranjeevi vs Garikapati

అనంతరం చిరంజీవి తన ప్రసంగంలో గరికపాటి గురించి ప్రస్తావించారు. ఒక విధంగా ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఒకరోజు ఇంటికి పిలిచి సన్మానించుకుంటాను అన్నారు. చిరంజీవిని ఉద్దేశించి ఒక బహిరంగ వేదికపై గరికపాటి అలా మాట్లాడటం, సహనం కోల్పోవడం సరికాదని కొందరి అభిప్రాయం. మెగా ఫ్యాన్స్ అయితే గరికపాటి మీద ఫైర్ అవుతున్నారు. 
 

Chiranjeevi vs Garikapati

సోషల్ మీడియా ట్రోల్స్ కి తెగబడిన మెగా ఫ్యాన్స్ చిరంజీవికి గరికపాటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆయన ప్రవచన కార్యక్రమాలు అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. చిరంజీవి లాంటి ఉన్నతమైన వ్యక్తిని గరికపాటి అందరి ముందు అవమానించారని వారు అభిప్రాయపడుతున్నారు. 
 

మరి ఈ వివాదంలో తప్పు ఎవరదని పరిశీలిస్తే మెజారిటీ వర్గాలు గరికపాటి వైపే వేలు చూపుతున్నారు. పాపులారిటీ ఉన్న ఒక హీరో జనంలోకి వస్తే ఫోటోలు దిగడం సర్వసాధారణం. అంత పెద్ద సభలో ఒక మూలన జరుగుతున్న ఫోటోల కార్యక్రమం వలన వచ్చిన నష్టమేమీ లేదు. ఆ ఫోటోలు దిగే 20 మంది మహిళలు గరికపాటి ప్రసంగం వినకపోయినా నష్టమేమీ లేదు. ఎందుకంటే వేల మంది వేదిక ముందు ఉన్నారు.

ఒకవేళ చిరంజీవి ఫోటో సెషన్ ఆయన్ని ఇబ్బంది పెడుతుంటే... సమాచారం మెల్లగా చిరంజీవి చెవిలో వేస్తే బాగుండేది. అలా కాకుండా ఆయన వేల మందికి వినిపించేలా మైక్ లో చెప్పి తన ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి చిన్న విషయాన్ని గరికపాటి సీన్ చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది. 
 


 చాలా మంది చిత్ర ప్రముఖులు చిరంజీవికి మద్దతుగా ట్వీట్స్ వేస్తున్నారు. గరికపాటి అవమానించాలని చూసినా.. హుందాగా వ్యవహరించారని అంటున్నారు. ఇక చిన్న విషయాలకు కూడా బుస్సున లేచే నాగబాబు ఎందుకు ఊరుకుంటారు. అందరికంటే ముందు గరికపాటి పై పెద్ద సెటైర్ వేశాడు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. 
 

click me!