తెలుగు అందం ఈషా రెబ్బాకి ఆ ఇద్దరు స్పెషల్‌ అట? బర్త్ డే బ్యూటీ మోస్ట్ వైరల్‌ హాట్‌ ఫోటోస్‌ ఇవే..

First Published Apr 19, 2021, 4:02 PM IST

తెలుగు పదహారణాల అందం ఈషా రెబ్బా. నేడు తన 31వ పుట్టిన రోజుని జరుపుకుంటోంది. ఓ ఇద్దరు మాత్రం ఈ అమ్మడికి స్పెషల్‌ బర్త్ డే విషెస్‌ తెలిపారు. అంతేకాదు ఈ భామ మోస్ట్ వైరల్‌ హాట్‌ ఫోటోస్‌ ఇప్పుడు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

తెలుగమ్మాయి అయిన ఈషా రెబ్బా సోమవారం(ఏప్రిల్‌ 19)న బర్త్ డే జరుపుకుంటోంది. కరోనా నేపథ్యంలో చాలా నిరాడంబరంగానే ఆమె బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకుంటుంది.
undefined
అయితే ఈ సందర్భంగా ఓ ఇద్దరు మాత్రం ఈషా బర్త్ డేని స్పెషల్‌గా మార్చారు. అందరి కంటే ముందే ఈషాని సర్‌ప్రైజ్‌ చేశారు. రాత్రిఆమెకి తమ నివాసంలో బర్త్ డే కేక్‌కట్‌ చేయించి స్పెషల్‌గా విశెష్‌ తెలిపారు.
undefined
వాళ్లు ఎవరో కాదు హీరో డాక్టర్ రాజశేఖర్‌ డాటర్స్ శివానీ, శివాత్మిక. ఈ విషయాన్ని, ఈ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ఈషా వారికి ధన్యవాదాలు తెలిపింది.
undefined
ఇదిలా ఉంటే తన బర్త్ డే సందర్భంగా ఈషా రెబ్బాకి చెందిన పలు హాట్‌ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పలు సందర్భాల్లో బాగా వైరల్‌ అయిన ఈషా హాట్‌ పిక్స్ ఇప్పుడు సందడి చేస్తున్నాయి. ఆ పిక్స్ చూసేయండి.
undefined
ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటిస్తున్న ఈషా బిజీగానే ఉంది. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
undefined
తెలుగు హీరోయిన్లకి ఛాన్స్ లు రావనే నానుడి తప్పు అని తన ప్రతిభతో నిరూపిస్తుందీ హాట్‌ అందం.
undefined
టాలీవుడ్‌ అందాల భామ ఈషా ఎంబీఏ చేసింది. కాలేజ్‌ టైమ్‌లోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు రావడం ప్రారంభించాయి.
undefined
తొలుత ఈషా శేఖర్‌ కమ్ముల రూపొందించిన `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీ`లో నటించింది. కానీ అది గుర్తింపునివ్వలేదు. చిన్న పాత్ర కావడంతో అసలు ఈషాని ఎవరూ గుర్తించలేదు.
undefined
ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ ద్వారా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఈషాని కాంటాక్ట్ అయ్యాడు. దీంతో `అంతకు ముందు ఆ తర్వాత` చిత్రంలో నటించే ఆఫర్‌ దక్కించుకుంది.
undefined
ఇందులో సుమంత్‌ అశ్విన్‌ సరసన మెప్పించింది. ఇది సహజీవనం నేపథ్యంలో సాగే చిత్రం మంచి విజయం సాధించడంతో ఈషాకి గుర్తింపు వచ్చింది.
undefined
దీంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఈషాకి మంచి అవకాశాలే వచ్చాయి. `బందిపోటు`, `అమితుమి`, `దర్శకుడు`, `అ!`, `బ్రాండ్‌ బాబు`, ఎన్టీఆర్‌తో `అరవిందసమేత` చిత్రాల్లో నటించింది.
undefined
ఈ సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీసు వద్ద యావరేజ్‌ టాక్‌ని తెచ్చుకున్నా ఈషా నటనకు, ఆమె సినిమాల ఎంపికకి మంచి మార్కులే పడ్డాయి.
undefined
ఎన్టీఆర్‌తో `అరవింద సమేత`లో సెకండ్‌ లీడ్‌గా చేసింది. అయినప్పటికీ కాస్ల బబ్లీ రోల్‌లో మెప్పించింది. ఇందులో ఇంకాస్త ప్రయారిటీ ఉన్న రోల్‌ పడితే నిజంగానే ఈషా లైఫ్‌ మరోలా ఉండేదేమో.
undefined
`సవ్యసాచి` గెస్ట్ అప్పియరెన్స్ లో మెరిసింది. రెండేళ్ల క్రితం మెయిన్‌ లీడ్‌గా `రాగల 24 గంటల్లో` చిత్రంలో నటించి ఆకట్టుకుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ మూవీ `పిట్టకథలు`లో మెస్మరైజ్‌ చేసింది.
undefined
ప్రస్తుతం ఆమె `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే తమిళంలో `ఆయిరమ్‌ జెన్మంగల్‌` చిత్రంలో నటిస్తుంది.
undefined
అంతేకాదు తమిళం, మలయాళం బైలింగ్వల్‌ చిత్రం `ఒట్టు`లో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో అరవింద స్వామి మెయిన్‌ లీడ్‌గా కనిపించబోతుండటం విశేషం. (ఈషా అఫీషియల్‌ బర్త్ డే సీడీపీ)
undefined
నటన పరంగా, అందం పరంగా ఆకట్టుకుంటున్నా, ఛాన్స్ లు మాత్రమే పెద్దగా రావడం లేదు. స్టార్‌ హీరోలు ఈ బ్యూటీపై మనసు పడటం లేదు.
undefined
ఈషా మాత్రం గ్లామర్‌ విషయంలో ఏమాత్రం తగ్గనని చాలా ఇంటర్య్వూలో చెప్పింది. అవకాశం వస్తే అందాల ఆరబోతకు సిద్ధమే అని ఎప్పుడో చెప్పింది.
undefined
మరి ఫిల్మ్‌ మేకర్స్ ఆ దిశగా ఈషాని వాడుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సింగిల్‌గానే ఉన్న ఈ బేబీ ప్రేమలో పడేందుకు కూడా సిద్ధమే అని చెప్పింది.
undefined
అదే విషయంలో పలు మార్లు తన ఫోటోలను పంచుకుంటూ వెల్లడించింది. పువ్వు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ తీసుకునే వాళ్లే లేరని పేర్కొనడం విశేషం.
undefined
ఇక ఈ బర్త్ డే నుంచైనా తెలుగు అందం ఈషా రెబ్బా కెరీర్‌ పాజిటివ్‌ సైడ్‌ టర్న్ తీసుకుని బిజీ హీరోయిన్‌ అవ్వాలని ఆశిద్దాం.
undefined
ఈ సందర్బంగా ఈషా రెబ్బాకి `ఏషియానెట్‌` తెలుగు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్‌ తెలియజేస్తుంది.
undefined
లేటెస్ట్ గా వైరల్ అయిన ఈషా పిక్స్.
undefined
click me!