ఒంపుసొంపులతో హీట్ పెంచేస్తున్న అనన్య పాండే.. అదరహో అనిపిస్తున్న ఘాటైన పరువాలు

First Published Nov 23, 2021, 2:02 PM IST

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. 

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు Chunky Pandey కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన Ananya Pandey తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని కట్టిపడేస్తుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

తాజాగా అనన్య పాండే షేర్ చేసిన ఫోటో షూట్ స్టన్నింగ్ అనిపించే విధంగా ఉంది. వివిధ డిజైనర్ లెహంగాలలో అనన్య పాండే ఫోటోషూట్ చేసింది. యువరాణిలాగా ప్రతి డ్రెస్ లో అనన్య మెరిసిపోతోంది. ముఖ్యంగా ఎల్లో లెహంగాలో అనన్య థైస్ అందాలు ఆరబోతూ గిలిగింతలు పెడుతోంది. ఎల్లో లెహంగాలో అనన్య రెట్టింపు అందం, హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది.   

హెవీ డిజైన్ తో సిల్వర్, పింక్ లెహంగాలలో కళ్ళు జిగేల్ మానేలా అనన్య ఫోజులు అదరగొడుతున్నాయి. తాజా ఫోటోషూట్ లో అనన్య మరోసారి నెటిజన్లు పండగ చేసుకునేలా పరువాలు ఒలకబోస్తోంది. 

ఇదిలా ఉండగా అనన్య పాండే ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ Puri Jagannadh దర్శకత్వంలో 'Liger' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

అనన్య, Vijay Devarakonda మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ ఐరన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

బాలీవుడ్ లో అనన్య పాండే ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా పరిగణింపబడుతోంది. అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి అందాల భామలు పోటీ పడుతూ బాలీవుడ్ లో ఎదుగుతున్నారు. 

అనన్య పాండే చూడగానే ఆకట్టుకునేలా నాజూకు అందంతో ఆకర్షిస్తోంది. ఒంపు సొంపులతో అనన్య కుర్రాళ్లకు కలల రాణిగా మారుతోంది. అనన్య పాండే లైగర్ చిత్రంతో సౌత్ లో కూడా పాపులర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. Also Read: 'అద్భుతం' మూవీకి చిరంజీవి ఫిదా.. నావల్ కాన్సెప్ట్ అంటూ ప్రశంసలు, బుడ్డ ఇంద్ర వెరీ హ్యాపీ!

Also Read: 'దంగల్' నటితో అమీర్ ఖాన్ ఎఫైర్, త్వరలో మూడో వివాహం ? షాక్ లో బాలీవుడ్, అసలు నిజం ఇదిగో..

click me!