MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'దంగల్' నటితో అమీర్ ఖాన్ ఎఫైర్, త్వరలో మూడో వివాహం ? షాక్ లో బాలీవుడ్, అసలు నిజం ఇదిగో..

'దంగల్' నటితో అమీర్ ఖాన్ ఎఫైర్, త్వరలో మూడో వివాహం ? షాక్ లో బాలీవుడ్, అసలు నిజం ఇదిగో..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి సంచలన రూమర్ వైరల్ గా మారింది. అభిమానులని షాక్ లో ముంచెత్తేలా అమీర్ ఖాన్ మూడో వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో సైతం పుకార్లు వినిపిస్తున్నాయి.

2 Min read
Author : pratap reddy | Asianet News
Published : Nov 23 2021, 10:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి సంచలన రూమర్ వైరల్ గా మారింది. అభిమానులని షాక్ లో ముంచెత్తేలా అమీర్ ఖాన్ మూడో వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో సైతం పుకార్లు వినిపిస్తున్నాయి. ఇటీవల అమీర్ ఖాన్ తన రెండవ భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ సంయుక్తంగా విడాకుల ప్రకటన చేశారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Aamir Khan తన మొదటి భార్య రీనా దత్తా నుంచి విడిపోయాక 2005లో Kiran raoని వివాహం చేసుకున్నారు. లగాన్ చిత్రానికి కిరణ్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పరిచయం మొదలయింది. అయితే అమీర్ ఖాన్, కిరణ్ రావు విడిపోవడానికి కారణం దంగల్ నటి ఫాతిమా సనా అంటూ ఊహించని పుకార్లు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్, ఫాతిమా మధ్య ఎఫైర్ కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా వీరిద్దరి ఎఫైర్ గురించి రూమర్లు వినిపించాయి. 

 

36

Fatima Sana దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ పెద్ద కుమార్తెగా నటించింది. అలాంటి వీరిద్దరి మధ్య ఎఫైర్ అంటూ పుకార్లు వినిపిస్తుండడంతో అంటూ బాలీవుడ్, ఇటు అమీర్ అభిమానులు షాక్ లో ఉన్నారు. ప్రస్తుతం అమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం విడుదలయ్యాక అమీర్, ఫాతిమాల వివాహం ఉంటుందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. 

 

46

అయితే తాజా సమాచారం మేరకు అమీర్ ఖాన్ వినిపిస్తున్న రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని, ఆయన మూడో వివాహం చేసుకోవడం లేదని తేలింది. అమీర్ ఖాన్ సన్నిహిత వర్గాలు ఈ వార్తలని ఖండించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. అయితే గతంలో కూడా అమీర్ ఖాన్, ఫాతిమా రిలేషన్ షిప్ పై వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఎఫైర్ కారణంగానే కిరణ్ రావు అమీర్ ఖాన్ నుంచి విడిపోయినట్లు ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో అమీర్ ట్రోలింగ్ కు కూడా గురయ్యాడు. 

 

56

గతంలో ఫాతిమా సనా అమీర్ ఖాన్ తో రిలేషన్ షిప్ పై వస్తున్న రూమర్స్ పై స్పందించింది. నాకు సంబంధం లేని వ్యక్తులు, నేనెప్పుడూ కలవని వ్యక్తులు ఈ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తల్లో నిజం ఉందో లేదో కూడా వారికి తెలియదు. కానీ ఇలాంటి వార్తలు నాకు ఇబ్బందిగా మారతాయి. నా గురించి అంతా తప్పుగా భావిస్తారు. నేను మంచి వ్యక్తిని కాదు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. దయచేసి ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయొద్దు. నాకు సంబంధించిన ఏ విషయం గురించి అయినా నేరుగా నన్నే అడగండి. సమాధానం ఇస్తాను అని ఫాతిమా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. 

 

66

రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన దంగల్ చిత్రం 2016లో విడుదలై అఖండ విజయం అందుకుంది. దేశం మొత్తం ఈ చిత్రంపై ప్రశంసలు వర్షం కురిపించింది. ఈ చిత్రంలో ఫాతిమా అమీర్ ఖాన్ పెద్ద కుమార్తెగా కీలక పాత్రలో నటించింది. Also Read: Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌..`భీమ్లా నాయక్‌` రీషూట్‌.. దర్శకుడిగా త్రివిక్రమ్?

 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhoot Bangla OTT: భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్.. అక్షయ్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
Karuppu Collections: బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ.. 13 రోజుల్లో రికార్డ్ కలెక్షన్లు.. సూర్య మరో ట్రీట్‌
Recommended image3
Suriya: ఎట్టకేలకు బ్లాక్ బస్టర్.. 'కరుప్పు' ఫీవర్ తగ్గకముందే సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved