బన్నీ మెగా హీరో కాదు, చిరు సపోర్ట్ లేకుండానే ఎదిగాడు... మెగా ఫ్యామిలీలో వర్మ చిచ్చు!

First Published Aug 24, 2021, 11:30 AM IST

మెగా ఫ్యామిలీకి వర్మ బద్దశత్రువు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ వర్మ తీసిన సినిమాలు, కామెంట్స్ చాలా వివాదాస్పదం అయ్యాయి. పవన్ ఇమేజ్ డామేజ్ చేసేలా ఉండే వర్మ చర్యలు ఫ్యాన్స్ కి విపరీతమైన కోపం తెప్పిస్తూ ఉంటాయి. అందుకే పలుమార్లు వర్మపై మెగా ఫ్యాన్స్ దాడికి తెగబడ్డారు.

గత ఏడాది పవర్ స్టార్ టైటిల్ తో పవన్ పై ఓ సెటైరికల్ మూవీ తెరకెక్కించాడు వర్మ. 2019 ఎలక్షన్స్ ఓటమి తరువాత పవన్ మానసిక వేదనను ఈ మూవీలో వర్మ చూపించడం జరిగింది. కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీ జోలికి వెళ్లని వర్మ, మరోమారు ట్వీట్స్ తో టార్గెట్ చేశాడు.

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు మెగా హీరోలు పవన్ కళ్యాణ్, చరణ్, వరుణ్, ధరమ్, వైష్ణవ్ లతో పాటు అల్లు శిరీష్ చిరు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. చిరును స్వయంగా కలిసి బర్త్ డే విషెస్ తెలియజేశారు. 


చిరు నివాసంలో జరిగిన ఈ వేడుకకు మెగా హీరో బ్రాండ్ ఇమేజ్ కలిగిన మరో స్టార్ అల్లు అర్జున్ హాజరు కాలేదు. చిరు బర్త్ డే వేడుకలకు బన్నీ రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ట్విట్టర్ ద్వారా విష్ చేసినా, వేడుకలలో లేకపోవడంతో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. 

ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ వర్మ వరుస ట్వీట్స్ తో రెచ్చిపోయారు. చిరంజీవి తమ్ముళ్లు, కొడుకులు, మేనల్లుళ్ళు గా కంటే అల్లు రామలింగయ్య మనవడి హోదాలో స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ దే నిజమైన సక్సెస్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

వర్మ మరో ట్వీట్ లో...  చిరంజీవి మేనల్లుడుగా కాకుండా స్వయంగా స్టార్ గా ఎదిగినట్లు అల్లు అర్జున్ భావిస్తున్నాడు. అందుకే మిగతా మెగా హీరోల వలె అతడు చిరంజీవి బర్త్ డే వేడుకలకు హాజరుకాలేదు, అని కామెంట్ చేశారు. 

మూడవ ట్వీట్ లో వర్మ ఒరిజినల్ మెగాస్టార్ చిరంజీవి తరువాత ప్రెసెంట్ మెగాస్టార్ అంటే అల్లు అర్జున్ మాత్రమే... అని వివాదం రేపాడు వర్మ. మెగా హీరోల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న వర్మ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

మెగా కాంపౌండ్లో ఎదిగిన అల్లు అర్జున్ సక్సెస్ కి స్వయం కృషి, అలాగే అల్లు రామలింగయ్య వారసత్వం మాత్రమే, చిరంజీవి వలన అతను స్టార్ కాలేదంటూ వర్మ పరోక్షంగా తెలియజేస్తున్నాడు. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా అలానే భావిస్తున్నారని వర్మ ట్వీట్స్ ద్వారా అభిప్రాయ పడ్డారు. 


వర్మ లేటెస్ట్ పక్కన పెడితే అల్లు అర్జున్ నిజంగానే చిరు మేనల్లుడు అనిపించుకోవడం కంటే, అల్లు రామలింగయ్య మనవడిగానే గుర్తింపు పొందాలని అనుకుంటున్నారు. చిరు కంటే ముందే మొదలైన అల్లు వారి సినీ ప్రస్థానం, మెగా హీరో బ్రాండ్ కంటే గొప్పదని భావిస్తున్నారని గతంలోనే వార్తలు రావడం జరిగింది.

click me!