నటుడు ఆలీ పై ఆ హీరో ఫ్యాన్స్ ఫైర్... మా మాట అంటే లెక్క లేదా అంటూ సీరియస్ వార్నింగ్!

First Published Jul 1, 2021, 1:28 PM IST


సీనియర్ నటుడు ఆలీపై ఓ హీరో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.  మా.. మాట వినవా అంటూ మండిపడుతున్నారు. ఆలీ మీద సదరు హీరో ఫ్యాన్స్ కి ఎందుకు కోపం వచ్చిందో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.. 
 

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమైన ఆలీ స్టార్ కమెడియన్ గా వందల చిత్రాలు చేశారు. నటుడిగా నలభై ఏళ్లకు పైగా చరిత్ర ఆలీ సొంతం. ఇప్పటికీ డిమాండ్ ఉన్న కమెడియన్ గా ఆయన కొనసాగుతున్నారు.
undefined
కొన్నేళ్ల క్రితం టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ఆయన మారిన విషయం తెలిసిందే. కొన్ని కామెడీ షోలకు జడ్జిగా ఆలీ వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనను బుల్లితెరపై సూపర్ సక్సెస్ చేసిన కార్యక్రమం ఆలీతో సరదాగా...
undefined
ఆలీ హోస్ట్ గా వెండితెర, బుల్లితెరలకు సంబంధించిన సెలెబ్రిటీలను అతిథులుగా పిలిచి వాళ్ళ అనుభవాలను, అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉంటారు ఆలీ. గెస్ట్ జీవితంలోని ఆసక్తికర సంఘటలను సేకరించి వాటిపై ప్రశ్నలు అడగడం, ఆలీ షోలో ప్రత్యేకత.
undefined
చాలా కాలంగా మంచి టీఆర్పీతో నడుస్తున్న ఈ షో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించింది. ఈ షో ఎపిసోడ్స్, ప్రోమోలు యూట్యూబ్ లో అందుబాటులో ఉంటాయి.
undefined
దీనితో ఆడియన్స్ ఫలానా సెలెబ్రిటీని ఇంటర్వ్యూకి తీసుకురావలసిందిగా కామెంట్స్ రూపంలో డిమాండ్ చేస్తూ ఉంటారు
undefined
ఈ నేపథ్యంలో ఒకప్పుడు లవ్ బాయ్ ఇమేజ్ తో హిట్ చిత్రాలలో నటించిన వడ్డే నవీన్ ని అతిథిగా పిలవాలని వారు కామెంట్స్ పెడుతున్నారు. చాలా కాలంగా వడ్డే నవీన్ తీసుకురావాలని కోరుకుంటున్నప్పటికీ ఆలీ స్పందించడం లేదట.
undefined
దీనితో విసిగిపోయిన ఆడియన్స్.. ఎన్ని సార్లు కామెంట్స్ రూపంలో మా డిమాండ్ తెలియజేసినా ఆలీ పట్టించుకోవడం లేదు. ఆయన అసలు మన కామెంట్స్ చదవడం లేదా, అని ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో అయినా వడ్డే నవీన్ ని ఇంటర్వ్యూకి పిలవాలని కోరుకుంటున్నారు.
undefined
1997లో విడుదలైన 'కోరుకున్న ప్రియుడు' మూవీతో వెండితెరకు పరిచయమైన నవీన్, పెళ్లి, చాలా బాగుంది, మనసిచ్చి చూడాలి వంటి హిట్ చిత్రాలలో నటించారు. 'పెళ్లి' ఆయన కెరీర్ లో భారీ హిట్ కొట్టింది.
undefined
click me!