బుల్లితెర డాన్స్ సెన్సేషన్ ఆట గీతిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా... టీనేజ్ లుక్ లో షాకిస్తున్న అమ్మడు!

First Published Jun 8, 2021, 2:38 PM IST

కొన్నేళ్ల క్రిందట జీ తెలుగులో ప్రసారమైన ఆట జూనియర్స్ డాన్స్ ప్రోగ్రామ్స్ చాలా పాప్యులర్ అయ్యింది. ఓంకార్ యాంకర్ గా సుందర్ మాస్టర్ తో పాటు మరికొందరు జడ్జెస్ గా ఉన్న ఆట జూనియర్స్ లో గీతిక ఓ సంచలనం.

ఐదేళ్లు కూడా నిండని గీతిక తన డాన్సులతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచేసేవారు. బొద్దుగా పాలబుగ్గలతో చక్కగా ఉండే గీతిక డాన్స్ విషయంలో చిచ్చర పిడుగు. దానికి తోడు గీత ముద్దుముద్దు మాటలు మెస్మరైజ్ చేసేవి.
undefined
ఆట జూనియర్స్ షోకి గీతిక ప్రధాన ఆకర్షణగా నిలవడంతో పాటు టైటిల్ కూడా గెలుచుకుంది. ఆ షో గీతికను బాగా పాప్యులర్ చేసింది. దీనితో బుల్లితెరపై, వెండితెరపై ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.
undefined
కారా మజాకా పేరుతో ఓ ఫాంటసీ మూవీ తెరకెక్కగా గీతిక ప్రధాన పాత్ర చేశారు. కనీస పరిజ్ఞానం కూడా లేని వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా గీతిక బిజీ అయ్యారు. అయితే ఆ సమయంలోనే ఆమెకు ప్రమాదం జరిగింది. మేజర్ ఆక్సిడెంట్ లో కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి.
undefined
ఆ తరువాత గీతిక నటించడం మానేశారు. ఒకప్పుడు పసిపాపగా ఉన్న గీతిక ఇప్పుడు టీనేజ్ కి చేరుకుంది. చాలా కాలం తరువాత ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన చదువు, కుటుంబం, ప్రస్తుత పరిస్థితుల గురించి తెలిపారు.

Photo courtesy: Wall poster 

గీతిక అమ్మానాన్న ఉద్యోగ రీత్యా దుబాయ్ వెళ్లారట. ఇక గీతిక తన తాతయ్య, నాన్నమ్మ దగ్గర పెరిగారట. ఆఫర్స్ వస్తున్నప్పటికీ తనతో షూటింగ్స్ కి రావడానికి నాన్నమ్మ, తాతయ్య ఇబ్బంది పడేవారట. ఆ కారణం నటించడం మానేశాను అని గీతిక అన్నారు.

Photo courtesy: Wall poster 

చదువుపై దృష్టి పెట్టడం కూడా నటించక పోవడానికి ఒక కారణం అని ఆమె తెలిపారు.  గీతిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారట. ఈ ఏడాది ఇంటర్ పూర్తి అవుతుందని గీతక చెప్పారు.

Photo courtesy: Wall poster 

ఇక డాన్స్ గుర్తుందా మరిచిపోయావా... అని యాంకర్ అడుగగా, డాన్స్ నా డి ఎన్ ఏ లోనే ఉంది. దానిని మరచిపోవడం కుదరదని తెలిపారు.
undefined
నాకు ఆక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఏదో ఐపోయిందని యూట్యూబ్ ఛానల్స్ లో తప్పుడు వార్తలు వచ్చాయని గీతిక చెప్పడం విశేషం.

Photo courtesy: Wall poster 

click me!