ఎయిర్ పోర్ట్ లో సంజయ్ దత్ చేసిన పని...రూడ్ గా బిహేవ్ చేసాడంటూ తిట్లు

By Surya PrakashFirst Published Apr 29, 2024, 3:17 PM IST
Highlights

 ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాంతో కొందరు ఇది పద్దతి కాదు..రూడ్ గా బిహేవ్ చేసాడు. సెల్ఫీ దిగటానికి కూడా పనికిరాకపోతే


బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనందటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న సంజయ్ దత్ ఇప్పటికీ బిజీగా ఉన్నారు. కామెడీ నుంచి రోమాన్స్ వరకు ఏది పడితే అది చేయగల సామధ్యం ఆయనది. ఓ రేంజి సక్సెస్ లు చూసాడు..అదే స్దాయిలో డిజాస్టర్స్ చూసాడు . ఓ ప్రక్కన గ్యాంగస్టర్ పాత్రలు వేస్తూనే పోలీసు చేసి మెప్పించాడు. ఇవి అతనికి ప్రత్యేకతను, పేరును సంతరించి పెట్టాయి. ఇప్పుడు దక్షిణాది భాషల్లో కూడా విలన్ గా చేస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రత్యేకంగా తెలుగులో ఆయన విలన్ గా చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం వస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే... రీసెంట్ గా  సంజయ్ దత్  ముంబై విమానాశ్రయంలో   కనిపించాడు.  దాంతో ఆయనతో సెల్ఫీ దిగేందుకు చాలా మంది అభిమానులు ప్రయత్నించారు. అయితే పర్శనల్ సెక్యూరిటీ వారు ఎవరినీ దగ్గరకి రానివ్వలేదు. అయితే ఓ అభిమాని మాత్రం ధైర్యం చేసి ముందుకు వచ్చి సెల్ఫీ దిగే ప్రయత్నం చేసాడు. దాంతో ఆ అభిమానిని నెట్టివేసాడు సంజయ్ దత్. ఈ క్రమంలో సంజయ్ పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో చూస్తే  సంజయ్ దత్ ఆగి, ఫొటోలకు ఫోజులిచ్చే  మూడ్‌లో ఉన్నట్లు కనిపించలేదు మరియు అతను అభిమానులతో సంభాషించలేదు. ఎయిర్‌పోర్ట్‌లో ఉత్సాహంగా ఉన్న అభిమానిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విసుగు చెందిన సంజయ్ అభిమానిని దూరంగా నెట్టడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాంతో కొందరు ఇది పద్దతి కాదు..రూడ్ గా బిహేవ్ చేసాడు. సెల్ఫీ దిగటానికి కూడా పనికిరాకపోతే ఇంకెందుకు అభిమాన నటుడు అంటూ విమర్శలు చేయటం కనపడుతోంది. 

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (SanjayDutt) ఇప్పుడు పూరి జగన్నాథ్ (PuriJagannadh), రామ్ పోతినేని (RamPothineni) కాంబినేషన్ లో వస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' (DoubleiSmart) సినిమాలో ప్రధాన విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అప్పుడే ఒక పోరాట సన్నివేశం కూడా చిత్రీకరించారు కూడా.  

ఆ మధ్యనే అతని పుట్టినరోజు సందర్భంగా అతని పోస్టర్ కూడా సినిమానుండి విడుదల చేశారు కదా. అది బాగా వైరల్ కూడా అయింది. అయితే ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ సరిపోతాడని ముందుగానే అతడిని సంప్రదించి అతడే కావాలని తీసుకున్నారు. ఆ పాత్రకి వేరే ఎవరినీ అనుకోలేదు, ఊహించుకోలేదు కూడా, అందుకే మేకర్స్ సంజయ్ ని తీసుకున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడానికి సంజయ్ దత్ కి ఇచ్చిన పారితోషికం అక్షరాలా రూ 15 కోట్ల (Rs15 crore as remuneration for Sanjay Dutt) రూపాయలు. అతను ఈ సినిమాకి రెండు నెలలు అంటే 60 రోజులపాటు తన తేదీలను ఇస్తున్నాడు అని తెలిసింది. ఈ 60 రోజులకు గాను 15 కోట్ల రూపాయలు సంజయ్ దత్ తీసుకుంటున్నారు పారితోషికంగా అంటే అది చాలా ఎక్కువ. అంటే రోజుకి 25 లక్షల రూపాయలు అన్నమాట. ఇంత భారీగా ఈమధ్య కాలంలో ఏ నటుడికీ ఇంత పారితోషికం ఇవ్వలేదని తెలిసింది.

click me!