నాకు కాబోయేవాడు అతడే, మూడేళ్ళ తరువాత పెళ్లి... సురేఖావాణి కూతురు సుప్రీత షాకింగ్ కామెంట్స్!

First Published May 14, 2021, 1:38 PM IST

నటి సురేఖా వాణి కూతురు సుప్రీత నెటిజెన్స్ కి పరిచయం అక్కర్లేని పేరు. తల్లితో పాటు సోషల్ మీడియా పోస్ట్స్ , కామెంట్స్ తో ఈమె ఫేమ్ తెచ్చుకున్నారు. 
 

సురేఖా, సుప్రీత తల్లీ కూతుళ్లు అయినప్పటికీ మిత్రులవలె మెలుగుతారు. పొట్టి బట్టల్లో ఫోటో షూట్స్ చేయడం, డాన్స్ వీడియోలు కలిసి చేయడం వీరిద్దరికీ సరదా. సోషల్ మీడియాలో సుప్రీత అలానే ఫేమస్ అయ్యారు.
undefined
ఇక టూర్స్, వెకేషన్స్ కి కూడా ఇద్దరూ కలిసి వెళుతుంటారు. ఆ మధ్య సురేఖా రెండో పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు రావడం జరిగింది. లెక్కకు మించిన వరుస వార్తల నేపథ్యంలో సురేఖా స్వయంగా వివరణ ఇచ్చారు. నాకు రెండో వివాహం చేసుకొనే ఆలోచన లేదని వివరించారు.
undefined
ఈ విషయంలో సుప్రీత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నిరాధారమైన రాతలు ఎలా రాస్తారంటూ మీడియాపై ఫైర్ అయ్యారు. జరిగింది రాయండి,
undefined
ఊహించుకొని వార్తలు రాయవద్దని, మీ ఆదాయం కోసం ఇతరుల గౌరవాన్ని కించపరచ వద్దని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
undefined
మరో వైపు సుప్రీత త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందంటూ వార్తలు వస్తున్నాయి. సుప్రీత సైతం సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటూ, ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
undefined
తాజాగా లైవ్ ఛాట్ లో పాల్గొన్న సుప్రీత ఫ్యాన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పారు.
undefined
ముఖ్యంగా పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీత. ఎలాంటి అబ్బాయిని మీరు పెళ్లి చేసుకుంటారని ఓ నెటిజెన్ అడుగగా, అతిగా ఆలోచించకుండా, ప్రశాంతంగా ఉండే వ్యక్తి తనకు నచ్చుతారని, అలాగే తన అల్లరి, పిచ్చిని భరించే వాడే తన భర్త అంటూ సూటిగా సమాధానం చెప్పింది.
undefined
ఇక తాను మూడు నాలుగేళ్లలో పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పడం విశేషం. హీరోయిన్ యాంబిషన్ కలిగిన అమ్మాయిలు పెళ్లి అంటే ససేమిరా అంటారు. సుప్రీత మాత్రం చాలా తక్కువ కాలంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఆసక్తి గొలిపే అంశం.
undefined
టీనేజ్ లో ఉన్న సుప్రీత హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ కలిగి ఉన్నారు. వెండితెరపై సుప్రీత సక్సెస్ అయ్యే ఛాన్స్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
undefined
click me!