థ్యాంకూ మెంటర్ ధోనీ... అప్పుడు ప్లేయర్‌గా మొదటి వరల్డ్‌కప్, ఇప్పుడు మెంటర్‌గా కూడా...

First Published Nov 1, 2021, 4:55 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియా కథ దాదాపు ముగిసినట్టే. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన భారత జట్టు, ప్లేఆఫ్స్ ఆశలను వదిలేసుకుంది. ఇంకా ఛాన్స్ ఉన్నా, అది ‘గాలిలో దీపం పెట్టి, దేవుడా నువ్వే దిక్కు అని వేడుకోవడం’తో సమానం...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఫెయిల్యూర్‌తో మెంటర్ మహేంద్ర సింగ్ ధోనీపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ‘థ్యాంక్యూ మెంటర్ ధోనీ’ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది...

నిజానికి టీమిండియాకి దొరికిన ఓ వరం మహేంద్ర సింగ్ ధోనీ. అయితే అతను కొన్నిసార్లు శాపంలా మారాడు కూడా. ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టీమిండియాకి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ...

అయితే కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయిన ఎమ్మెస్ ధోనీ, చాలా మ్యాచుల్లో ప్లేయర్‌గా ఫెయిల్ అయ్యాడు. అయినా ఆ ప్రభావం టీమ్‌పై పెద్దగా పడేది కాదు...

ఎందుకంటే ఎమ్మెస్ ధోనీ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చేవాడు. దాంతో అంతకుముందే గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, సురేష్ రైనా వంటి ప్లేయర్లు బ్యాటుతో రాణించేవాళ్లు...

దీంతో లోయర్ ఆర్డర్‌లో ధోనీ ఫెయిల్ అయినా ఆ ప్రభావం మిగిలినవారిపై పెద్దగా పడేది కాదు. అయితే విరాట్ కోహ్లీ పరిస్థితి అలా కాదు. విరాట్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్. అతను ఫెయిల్ అయితే మిగిలిన ప్లేయర్లు చాలా ఒత్తిడికి లోనవుతున్నారు...

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 11 ఓవర్ల పాటు ఒక్కటంటే ఒక్క బౌండరీ కొట్టలేకపోయారు భారత బ్యాట్స్‌మెన్. ఇదే మెంటర్ ఎమ్మెస్ ధోనీపై విమర్శలు రావడానికి కారణమైంది...

కెరీర్ ఆరంభంలో వీరబాదుడు బాదుతూ బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న ఎమ్మెస్ ధోనీ, ఆ తర్వాత ‘డిఫెక్స్ కింగ్’గా మారిపోయాడు. 30 బంతులు ఆడితే 10-12 పరుగులు కూడా చేసేవాడు కాదు...

మెంటర్‌గా మారిన తర్వాత విరాట్ కోహ్లీకి కూడా ఇలాంటి సలహాయే ధోనీ ఇచ్చి ఉంటాడని, అందుకే విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతులు ఆడినా ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడని ట్రోల్స్ వస్తున్నాయి...

ఎమ్మెస్ ధోనీని గురువుగా భావించే యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా 19 బంతులు ఆడినా ఒక్క బౌండరీ కొట్టలేకపోయాడు. వస్తూనే సిక్సర్లు ఊపే పంత్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఏ మాత్రం ఊహించలేదు ఫ్యాన్స్...

ఇంగ్లాండ్ టూర్‌లో, ఆస్ట్రేలియా టూర్‌లో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌ సిక్సర్లు, ఒంటి చేత్తో సిక్సర్లు కొట్టిన రిషబ్ పంత్‌ను ఏం చెప్పి నీలా మార్చేశావంటూ మాహీని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...

అయితే ధోనీ ఫ్యాన్స్ మాత్రం ఈ ట్రోలింగ్‌ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. టీమిండియా ఫెయిల్ అయితే, మెంటర్ ఏం చేస్తాడని, మెంటర్ చెప్పగలడు కానీ క్రీజులోకి వచ్చి ఆడగలడా? అంటూ సమాధానం ఇస్తున్నారు..

టీమిండియా ప్రాక్టీస్ మ్యాచుల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చినప్పుడు, కామెంటేటర్లతో సహా ధోనీ ఫ్యాన్స్ అందరూ... ‘అంతా మాహీ మహిమ’... ‘అంతా మహేంద్ర జాలం’ అంటూ పొడగ్తల వర్షం కురిపించారు.

దీంతో టీమిండియా ఫెయిల్ అయినప్పుడు కూడా మాహీ ఎఫెక్ట్ ఉంటుందని, పొడగ్తలను స్వీకరించినప్పుడు, విమర్శలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

మరికొందరైతే ఎమ్మెస్ ధోనీ ఆడిన మొదటి వరల్డ్‌కప్ (2007 వన్డే వరల్డ్‌కప్)లో భారత జట్టు ఘోరంగా ఫెయిల్ అయ్యిందని, ఇప్పుడు మెంటర్‌గానూ అతని మొదటి వరల్డ్‌కప్ (2021 టీ20 వరల్డ్‌కప్)లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని గుర్తు చేస్తున్నారు.

ఆ లెక్కన వచ్చే సీజన్‌లో టీమిండియా టైటిల్ గెలుస్తుందని, మాహీని మెంటర్‌గా కొనసాగిస్తే 2022 టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌తో పాటు, 2023 వన్డే వరల్డ్‌కప్ కడా భారత జట్టు సొంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు...

click me!