అప్పుడు కుర్రాళ్లలో స్పార్క్ లేదన్నాడు, ఇప్పుడేమో... మరోసారి ధోనీ కామెంట్లపై ట్రోల్స్..

First Published May 13, 2022, 4:35 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తర్వాత ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న రెండో జట్టుగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. రవీంద్ర జడేజా కెప్టెన్సీలో సీజన్‌ని ఆరంభించిన సీఎస్‌కే, ఆ తర్వాత కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీ రీఎంట్రీతో సీజన్‌ని ముగించనుంది..

2020 సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకపోవడం ఇది రెండోసారి. ఈ రెండు సీజన్లలోనూ సురేష్ రైనా లేకుండా బరిలో దిగింది సీఎస్‌కే...

2020 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత యంగ్ స్టర్స్‌లో స్పార్క్ కనిపించడం లేదని సంచలన కామెంట్లు చేసిన ఎమ్మెస్ ధోనీ, తాజాగా మరోసారి యంగ్ ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు...

Latest Videos


‘మాకు ఎప్పుడూ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు రిజర్వు బెంచ్‌లో లేరు. ఈ సీజన్‌లో కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు. అయితే వాళ్లు రాణించడానికి కాస్త సమయం పడుతుంది.. 

మూడు ఫార్మాట్లలో ఆడేందుకు ఆరు నెలల సమయం తీసుకునే ప్లేయర్లు దొరికితే అదృష్టమే... ఐపీఎల్‌ అదే చేస్తుంది. కొత్త కొత్త అవకాశాలను క్రియేట్ చేస్తుంది... యంగ్ ఫాస్ట్ బౌలర్లు చాలా ధైర్యంగా ఆడుతున్నారు...

ఎక్కువ మ్యాచులు ఆడితే, మరింత నమ్మకంగా బౌలింగ్ చేయగలగారు. ఏ బ్యాట్స్‌మెన్‌కి ఎలాంటి ప్లాన్స్ వేయాలో ప్రణాళికలు రచించగలుగుతారు...’ అంటూ కామెంట్ చేశాడు ఎమ్మెస్ ధోనీ...

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి వారిని ప్రోత్సహించిన సీజన్‌లు చాలా తక్కువ. ఈ మధ్యకాలంలో రుతురాజ్ గైక్వాడ్ తప్ప, సీఎస్‌కే నుంచి మరో యంగ్ స్టర్ వెలుగులోకి రాలేకపోయాడు. రుతురాజ్ కూడా ఐపీఎల్ 2020 సీజన్‌లో సీనియర్లు ఫెయిల్ అయిన తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినవాడే...

దీపక్ చాహార్ గాయం కారణంగా దూరం కావడంతో ముఖేశ్ చౌదరికి ఈ సీజన్‌లో వరుస అవకాశాలు దక్కాయి. లేదంటే అతను రిజర్వు బెంచ్‌లోనే మగ్గి, నెట్ బౌలర్‌గానే మిగిలిపోయేవాడు... 

అండర్ 19 వరల్డ్ కప్‌ 2022లో అదరగొట్టిన రాజ్‌వర్థన్ హంగేర్కర్ వంటి ప్లేయర్‌ని కొనుగోలు చేసి ఒక్క మ్యాచ్ కూడా ఆడించని సీఎస్‌కే, యంగ్ ప్లేయర్ల సత్తా గురించి కామెంట్ చేయడం హాస్యస్పదంగా ఉందంటున్నారు నెటిజన్లు...

కుర్రాళ్లకు అవకాశం ఇవ్వకుండా అంబటి రాయుడు, డీజే బ్రావో, రాబిన్ ఊతప్ప, మొయిన్ ఆలీ వంటి సీనియర్లను కొనుగోలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, రిజర్వు బెంచ్ బలంగా లేదనడం చూస్తుంటే తనలా 40+ వయసున్న బౌలర్లు ఎవ్వరూ లేరని మాహీ ఫీల్ అవుతున్నాడేమో అని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు... 

click me!