దొంగతనం చేసి దొరికిపోయిన సీత, టాస్క్ లతో హోరెత్తిన బిగ్ బాస్ హౌస్

First Published | Oct 10, 2024, 11:57 PM IST

బిగ్ బాస్ హౌస్ తాజా ఎపిసోడ్ లో టాస్క్ లతో హోరెత్తిపోయింది. అటు బీబీ హోటల్ టాస్క్ లో కామెడీ పండిస్తూనే.. మధ్యలో సీరియస్ టాస్క్ లతో హిట్ పెంచాడు బిగ్ బాస్. 
 

ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ తో పాటు.. ఉత్కంఠ కలిగించే ట్విస్ట్ లతో అదరగొడుతున్నాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ లతో ఇటు ఓజీ క్లాన్ తో పాటు.. అటు రాయల్ క్లాన్ టీమ్ కు కూడా దూల తీరిపోతోంది. ఇక టేస్టీ తేజ అయితే కొన్ని టాస్క్ లు ఆడలేక కిందపడిపోయి ఇబ్బంది పడ్డాడు. 
 

మరో టాస్క్ లో మణికంఠ అద్భుతమైన పెర్ఫామెన్స్ చూపించాడు. అటు నిఖిల్ కు ..మణింకఠకు మధ్య పోటా పోడీ నడిచింది. ఈ టాస్క్ లో మణింకఠ సక్సెస్ అయ్యి అందరిచేత శభాష్ అనిపించాడు. మణికంఠ పెట్టిన అఫెర్ట్స్ కు అంతా శభాష్ అన్నారు.

ఒంటికాలి మీద నిలబడి.. రెండు వాటలర్ గ్లాస్ లు..అది కూడా గాజు గ్లాస్ లను బ్యాలెన్స్ చేయడం అంటే మాటలు కాదు. ఇక ఈమధ్య లోనే గిల్లి కజ్జాలు కూడా వినిపించాయి. ఓజీ టీమ్ లో ప్రేరణ  హోటల్ మ్యానేజర్ కాగా ఆమె మాట ఎవరు వినడంలేదు. దాంతో ప్రేరణ అసహనం వెల్లడించింది.

అంతే కాదు డబ్బుల విషయంలో కూడా ఓజీ టీమ్ లో గొడవలు తప్పడంలేదు. ప్రేరణకు, సీతకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో  తాజా ఎపిసోడ్ చాలా ఉత్యంఠగా జరిగింది హోరా హోరీ పోరులో కొన్ని గెలుపులు.. కొన్ని ఓటములు తప్పలేదు. 


ఇక ఈ బీబీ  టాస్క్ లో ఎక్కువ డబ్బులు ఉండటంతో.. గెస్ట్ లు  విజేతలుగా నిలిచారు. అంతకు ముందు సేవ్ వాటర్ టాస్క్ లో ఓజీ టీమ్ గెలుపొంది.. 25 వేలు బహుమతిగా పొందారు. ఇక ఈరోజు టాస్కులలో  యష్మి, మణికంఠ, నిఖిల్, నబిల్.. అద్భుతమైన పెర్పామెన్స్ లు చూపించి ఓజీ టీమ్.. రాయల్ క్లాన్ నుంచి స్టార్స్ కూడా పొందారు.  

అంతకు ముందు సీత బీబీ హోటల్ టాస్క్ ముందు దొంగతనం చేయడంతో.. రాయల్ క్లాన్ సభ్యుల డబ్బులు తక్కువగా వచ్చాయి. దాంతో సీత తను చేసింది ఒప్పుకోక తప్పలేదు. అయితే ఆ డబ్బు ఇవ్వానికి సీత నిరాకరించింది. కాని ఓజి క్లాన్ సభ్యులు, మెగా ఛీఫ్ నబిల్ కూడా ప్రెజర్ చేయడంతో ఆ డబ్బు తిరిగి ఇచ్చేసింది. దాంతో రాయల్ క్లాన్ గెలిచింది. స్ట్రాటజీ ప్రకారం సీత ఆడబ్బు ఇవ్వకుండా ఉంటే.. ఓజీ క్లాన్ గెలిచేవారు. 

Latest Videos

click me!