దీపక్ చాహార్ ఓ డ్రగ్ లాంటోడు! వాడు ఈ జీవితంలో మారడు... LGM ట్రైలర్ రిలీజ్ వేడుకలో ధోనీ...

First Published Jul 11, 2023, 10:21 AM IST

అప్పుడెప్పుడో 2018లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసినా ఇప్పటికీ టీమ్‌లో సెటిల్ కాలేకపోయాడు దీపక్ చాహార్. ఆల్‌రౌండర్‌గా కొన్ని మ్యాచుల్లో మెరుపులు మెరిపించినా, వరుస గాయాలతో టీమ్‌కి దూరంగా ఉంటున్న దీపక్ చాహార్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు..

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.14 కోట్లు పెట్టి దీపక్ చాహార్‌ని తిరిగి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గాయంతో 2022 సీజన్‌లో ఆడని దీపక్ చాహార్, 2023 సీజన్‌లోనూ 6 మ్యాచులకు దూరంగా ఉన్నాడు... 

Deepak Chahar

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి 4 మ్యాచుల్లో వికెట్ తీయలేకపోయిన దీపక్ చాహార్, రీఎంట్రీ తర్వాత 6 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీ రోల్ పోషించాడు...

Latest Videos


ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహార్‌ని చాలాసార్లు ఏడిపిస్తూ కనిపించాడు. ఫైనల్ మ్యాచ్‌ తర్వాత ‘క్యాచ్ సరిగ్గా పట్టడం రాదు, నీకు ఆటోగ్రాఫ్ కావాలంట, ఇవ్వను పో... ’ అంటూ మాహీ, దీపక్ చాహార్‌తో గేలి చేయడం టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది..

తాజాగా తన సొంత బ్యానర్ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌పై నిర్మించిన తొలి సినిమా ‘ఎల్‌జీఎం’ (Lets Get Married) ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం చెన్నైకి చేరుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహార్‌తో తనకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నాడు..

‘దీపక్ చాహార్ ఓ డ్రగ్ లాంటోడు. అతను లేకపోతే ఎందుకు లేడు? ఎక్కడ ఉన్నాడని అని తెగ ఆలోచించేస్తాం. అతను పక్కనే ఉంటే, ఎందుకు ఉన్నాడా? అని తల పట్టుకుంటాం..

ఈ మధ్యే అతనిలో కాస్త కాస్త పరిణితి వస్తోంది. దానికి కొంచెం టైం పడుతుంది. అసలు సమస్య ఏంటంటే అతను మెచ్యూర్డ్‌గా మారడం నా జీవితంలో చూడలేనేమో...’ అంటూ నవ్వేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ..

Image credit: PTI

2011లో రాజస్థాన్ రాయల్స్, దీపక్ చాహార్‌ని కొనుగోలు చేసినా రెండు సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2016లో ధోనీ కెప్టెన్సీలో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన దీపక్ చాహార్, ఆ తర్వాత 2018లో చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వచ్చాడు.. 

click me!