స్టార్ డైరెక్టర్ వెళ్లి అడుక్కుంటే..సిల్లీ రీజన్ తో సూపర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన హీరో, అది బన్నీ ఖాతాలో

First Published | Oct 7, 2024, 9:00 PM IST

చిత్ర పరిశ్రమలో సినిమాలు హీరోల చేతులు మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని హిట్ చిత్రాలు వదులుకుంటే ఆ చిత్రం రిలీజ్ అయ్యాక బాధ తెలుస్తుంది.

చిత్ర పరిశ్రమలో సినిమాలు హీరోల చేతులు మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని హిట్ చిత్రాలు వదులుకుంటే ఆ చిత్రం రిలీజ్ అయ్యాక బాధ తెలుస్తుంది. చేజేతులా ఆఫర్ వదిలేసుకున్నాం అని చాలా మంది నటీనటులు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. 

హీరో సుమంత్ కెరీర్ ఆరంభంలో మంచి విజయాలు అందుకున్నాడు. సత్యం, గౌరి లాంటి చిత్రాలు ఆకట్టుకున్నాయి. సుమంత్ కి క్రేజ్ ఉన్న సమయంలో అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా వదులుకున్నాడు. స్వయంగా సుమంత్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడంటే పూరి జగన్నాధ్ ఫ్లాప్ చిత్రాలతో సతమతమవుతున్నారు కానీ ఒకప్పుడు పూరి రేంజ్ వేరు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి తన తనయుడు డెబ్యూ చిత్రానికి పూరి జగన్నాధ్ ని ఎంచుకున్నారంటే అతడి స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


అలాంటి పూరి దర్శకత్వంలో నటించాలని ప్రతి స్టార్ హీరో కలలు కనేవారు. పూరి జగన్నాధ్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సుమంత్ ఆయన చిత్రాన్ని రిజెక్ట్ చేశారట. అది కూడా చాలా సిల్లీ రీజన్ తో. పూరి జగన్నాధ్ దేశముదురు కథని ముందుగా సుమంత్ కోసం రాసుకున్నారట. సుమంత్ ని కలసి కథ చెప్పారు. ఆ కథలో మెయిన్ పాయింట్.. సన్యాసిగా మారి హిమాలయాల్లో తిరిగే ఒక యువతిని హీరో ప్రేమించడం. 

సన్యాసితో రొమాన్స్, ఆమెని ప్రేమించడం చాలా వింతగా ఉంది. జనాలు యాక్సెప్ట్ చేయరు అని సుమంత్ భావించాడట. సన్యాసిని ప్రేమించడం ఏంటి సార్ అని పూరితో చెప్పి.. ఇది వర్కౌట్ కాదేమో సార్ అని అన్నారట. దీనితో పూరి జగన్నాధ్ నిరాశగా వెనుదిరిగారు. అప్పుడే అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ గమనించారు. బన్నీ బాడీ లాంగ్వేజ్ కి ఈ కథ బాగా సెట్ అవుతుందని అతడికి చెప్పారు. ఆ విధంగా దేశముదురు చిత్రం అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్ళింది. 

ఈ చిత్రంతో అల్లు అర్జున్ సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీతో హన్సిక టాలీవుడ్ కి పరిచయం అయింది. తొలి చిత్రంతోనే ఆమె యువతని చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఈ మూవీలో అల్లు అర్జున్, హన్సిక కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. 

Latest Videos

click me!