సమంత నా సోల్‌ మేట్‌, పెళ్లిలో ఆమెని చూస్తే కన్నీళ్లొచ్చాయి, శోభితా దూళిపాళ చెప్పిన క్రేజీ స్టోరీ

First Published | Oct 7, 2024, 9:16 PM IST

హీరోయిన్‌ శోభితా దూళిపాళ త్వరలో పెళ్లిపీఠలెక్కబోతుంది. నాగచైతన్యని వివాహం చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె సమంత తన సోల్‌ మేట్‌ అని ప్రకటించడం వైరల్‌గా మారింది. 
 

శోభితా దూళిపాళ.. తెలుగు అమ్మాయి అయినా తెలుగులో కంటే హిందీలోనే బాగా క్లిక్‌ అయ్యింది. అక్కడే సినిమా అవకాశాలను అందుకుంది. అక్కడే నటిగా నిరూపించుకుని తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఇటు తెలుగు, అటూ హిందీ సినిమాలు చేస్తూ రాణిస్తుంది. బలమైన కంటెంట్‌ ఉన్న సినిమాలు, తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు చేస్తూ రాణిస్తుంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా నటిగా సక్సెస్‌ అవుతూ మెప్పిస్తుంది. తనదైన అందం, అభినయంతో అలరిస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.
 

Naga Chaitanya

శోభితా దూళిపాళ గత కొంత కాలంగా నాగచైతన్యతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు పలు మార్లు మీడియాకి కూడా దొరికారు. అయితే తమ రిలేషన్‌ని సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట ఎట్టకేలకు ఓపెన్‌ అయ్యింది. ఏకంగా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అందరికి షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.

ఈ ఇద్దరు ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. త్వరలోనే మ్యారేజ్‌ ఉండబోతుందని సమాచారం. అయితే ప్రస్తుతం సినిమాల పరంగా ఎవరికి వాళ్లు బిజీగా ఉన్నా, పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. 


నాగ చైతన్య ఇప్పటికే సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోయింది. వీరిద్దరు విడిపోవడానికి స్పష్టమైన కారణాలు తెలపలేదు. దీంతో రకరకాలు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. వ్యక్తిగత కారణాలే అని కొందరు, కాదు బయటకు సంబంధించిన చాలా పెద్ద వ్యవహారాలున్నాయని మరికొందరు అంటున్నారు.

నిజం ఏంటనేది వారిద్దరికి, నాగార్జున ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. అయితే సమంత, నాగచైతన్య విడిపోవడానికి శోభితా కూడా ఓ కారణమనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. చైతూ శోభితాకి దగ్గర కావడం వల్లే సమంత దూరమైందనే టాక్‌ కూడా నడుస్తుంది. ఇందులో నిజమేంటో తెలియాలి. 
 

ఈ నేపథ్యంలో తాజాగా శోభితా దూళిపాళ సమంతకి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఆమెతో రిలేషన్‌ని వెల్లడించింది. ఈ క్రమంలో సమంతని తన సోల్‌ మేట్‌గా ప్రకటించడం విశేషం. పెళ్లిపీఠలపై ఉన్న సమంతని చూసి శోభితాకి కన్నీళ్లు వచ్చాయట. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా, సమంత శోభితాకి సోల్‌ మేట్‌ ఏంటి? ఆమె పెళ్లిలో శోభితా ఏడవడమేంటి? అనే డౌట్‌ రావచ్చు.

ఇక్కడే ఓ క్రేజీ స్టోరీ ఉంది. సమంత అంటే హీరోయిన్‌ సమంత కాదు. తన చెల్లి సమంత. శోభితాకి ఒక చెల్లి ఉంది. తన పేరు సమంత. ఇటీవలే ఆమె పెళ్లి కూడా అయ్యింది. ఆమె గురించి ఓ ఇంటర్వ్యూలో శోభితా మాట్లాడుతూ, సమంత నా సోల్‌ మేట్‌ అని వెల్లడించింది. ఆమె తన చెల్లి అని, ఇటీవలే ఆమె పెళ్లి అయ్యిందని చెప్పింది శోభిత. 
 

చెల్లి పెళ్లిలో అందర్నీ కలుసుకున్నా, అన్ని పనులూ చూసుకుంటూనే తానూ చెల్లిలా రెడీ అవ్వాలనుకుందట. కానీ పెళ్లి పనుల్లో పడి రెడీ అవడానికి టైమ్‌ కుదరలేదని, కానీ అందంగా రెడీ అయి పెళ్లి పీఠలపై కూర్చున్న చెల్లి సమంతని చూసి తాను ఎంతో సంతోషించిందని, ఆ హ్యాపీనెస్‌లో కన్నీళ్లు కూడా వచ్చినట్టు చెప్పింది శోభితా.

తన జీవితంలో బెస్ట్ మూమెంట్స్ లో అది ఒకటని చెప్పింది. ప్రస్తుతం శోభితా కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. సమంత పేరు చెప్పడంతో, అది తనకు కాబోయే భర్త నాగచైతన్య మాజీ భార్య కావడంతో అంతా ఆ హీరోయిన్‌ సమంతనేమో అని భావిస్తున్నారు. అందుకే ఆమె కామెంట్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

శోభితా దూళిపాళ.. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి సినిమాల్లోకి వచ్చింది. ఆమె `రామన్‌ రాఘవ్‌ 2.0` చిత్రంతో నటిగా మారింది. అనురాగ్‌ కశ్యప్‌ ఆమెకి ఛాన్స్ ఇచ్చాడు. తెలుగులో `గూఢచారి` మూవీలో నటించింది. `మేజర్‌` చిత్రంతో ఆకట్టుకుంది. దీంతోపాటు `చెఫ్‌`, `కాలకాండి`, `ది బాడీ`, `గోస్ట్ స్టోరీస్‌` చిత్రాలతోపాటు తమిళంలో `పొన్నియిన్‌ సెల్వన్‌` రెండు పార్ట్ ల్లో, `లవ్‌ సితార` హిందీ మూవీలో మెరిసింది శోభితా. దీంతోపాటు వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తూ బిజీగా ఉంది. 

Read more: ఎన్టీఆర్‌ చెప్పిన పాన్‌ ఇండియా సినిమాల సక్సెస్‌ ఫార్మూలా, ఈ చిన్న లాజిక్‌ వదిలేసి కోట్లు కుమ్మరిస్తున్నారే?

Also Read: చెన్నైలోనే అత్యంత సంపన్న ఫ్యామిలీ, కట్‌ చేస్తే ఆస్తులన్నీ కోల్పోయి రోడ్డుమీదకు, తేజ లైఫ్‌లో జరిగిన దారుణం

Latest Videos

click me!