T20 వరల్డ్‌కప్‌ 2021కి వేదికలు షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ... హైదరాబాద్‌కి నో ఛాన్స్...

First Published Dec 23, 2020, 12:04 PM IST

కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన టీ20 వరల్డ్‌కప్‌, 2021లో నిర్వహించబోతోంది బీసీసీఐ. టీమిండియా వేదికగా జరిగే ఈ వరల్డ్‌కప్ నిర్వహణ కోసం ఆరు నగరాలను షార్ట్ లిస్టు చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలను షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ, హైదరాబాద్ నగరాన్ని మాత్రం పక్కనబెట్టింది.

నిజానికి 2020 సెప్టెంబరు నెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా అది వీలు కాలేదు...
undefined
టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ కోసం ఎనిమిది వేదికలను షార్ట్ లిస్టు చేసింది బీసీసీఐ. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, మొహాలి, ధర్మశాల, కోల్‌కత్తా, ముంబై నగరాలు వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
undefined
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలను కూడా వేదికలను షార్ట్ లిస్టు చేసిన బీసీసీఐ, హైదరాబాద్ నగరాన్ని మాత్రం పట్టించుకోకపోవడం విశేషం.
undefined
ఈ వేదికలు, నిర్వహణ ప్రణాళికలు, వ్యూహ్యాల గురించి డిసెంబర్ 24న జరిగే వార్షిక జనరల్ మీటింగ్‌లో చర్చించ బోతున్నారు బీసీసీఐ బోర్డు సభ్యులు...
undefined
ఇదే మీటింగ్‌లో ఐపీఎల్ 2021 సీజన్‌లో అదనంగా చేర్చబోయే జట్ల గురించి కూడా చర్చించబోతున్నారు. అదనపు జట్లను 2021లో చేర్చాలా? లేక 2022 సీజన్‌లో చేరిస్తే మంచిదా అనే విషయాలపై చర్చించబోతున్నట్టు తెలిపారు బీసీసీఐ అధికారి.
undefined
2016లో మొదటిసారిగా టీ20 వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం ఇచ్చింది ఇండియా. ఆ ఎడిషన్‌లో ధోనీ నాయకత్వంలోని టీమిండియా సెమీ ఫైనల్‌కి చేరింది.
undefined
సెమీ ఫైనల్‌లో టీమిండియాను ఓడించిన వెస్టిండీస్, ఫైనల్‌ ఇంగ్లాండ్‌ను ఓడించి రెండోసారిటీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది...
undefined
2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌ను టీమిండియా సొంతం చేసుకోగా, ఆ తర్వాత 2009లో పాకిస్తాన్, 2010లో ఇంగ్లాండ్, 2012, 2016లో వెస్టిండీస్, 2014లో శ్రీలంక ఈ వరల్డ్‌కప్‌ను గెలిచాయి.
undefined
click me!