ఏడిస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | May 2, 2024, 9:56 AM IST

కష్టమొచ్చినా, బాధొచ్చినా కన్నీళ్లు అస్సలు ఆగవు. ఇది అందరికీ తెలిసిందే. కానీ మనం ఏడిస్తే ఏం జరుగుతుందనేది చాలా మందికి తెలియదు. అసలు ఏడుపు మనకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అనేది ఎంత మందికి తెలుసు.
 

crying

ప్రతి ఒక్కరికీ ఏడుపు వస్తుంది. ఏడుపు అనేది చాలా సాధారణ చర్య. బాధ కలిగినప్పుడు, కష్టమొచ్చినప్పుడు, ఎవరైనా తిట్టినప్పుడు లేదా భావోద్వేగానికి గురైనప్పుడు ఆటోమెటిక్ గా ఏడుపు వస్తుంది. కానీ ఈ ఏడుపు వల్ల మన శరీరానికి ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఏడుపు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్నో పరిశోధనలు కనుగొన్నాయి. అవును ఏడుపు మన మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు ఏడిస్తే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బరువు తగ్గడం

ఏడుపు కూడా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అవును ఏడిస్తే కేలరీలు బర్న్ అవుతాయి. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు బాధగా ఉన్నప్పుడు బరువు తగ్గడాన్ని గమనించే ఉంటారు. ఎందుకంటే ఏడుపు కేలరీలను బర్న్ చేస్తుంది. బాధగా ఉన్నప్పుడు ఆకలి తక్కువగా ఉంటుంది. 
 

Latest Videos


ఒత్తిడిని తగ్గిస్తుంది

మీరు ఏడుస్తున్నప్పుడు కళ్ల నుంచి కారే కన్నీటిలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్లు కన్నీళ్ల ద్వారా విడుదలవుతాయి. దీనివల్ల మీ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. మీరు గమనించారో లేదో ఏడిచిన తర్వాత ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. 

కళ్లు శుభ్రంగా ఉంటాయి

కన్నీళ్ల వల్ల మన కళ్లు క్లియర్ అవుతాయి. నిజానికి ఏదైనా చెత్త లేదా దుమ్ము, ధూళి లేదా మరేదైనా కంట్లో పడితే కళ్ల నుంచి వచ్చే కన్నీళ్ల ద్వారా అవి బయటకు వస్తాయి.  కన్నీటిలో ఒక రకమైన ఎంజైమ్ ఉంటుంది. దీనిని లైజోజైమ్ అంటారు. ఇది బ్యాక్టీరియా మొదలైన వాటిని చంపుతుంది. అలాగే ఇది కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 

నొప్పి నుంచి ఉపశమనం 

గాయాలు అయినప్పుడు, నొప్పి కలిగినప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు. అలాగే కొన్ని కొన్నిసార్లు అనవసరంగా కూడా కన్నీళ్లు వస్తుంటాయి. ఎందుకంటే ఏడుపు మీ నొప్పిని తగ్గిస్తుంది. కన్నీటిలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అందుకే ఏడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 

ఎమోషనల్ బ్యాలెన్స్ ఏర్పడుతుంది

ఇవి ఆనందభాష్పాలు అని కొంతమంది చెప్పడం మీరు గమనించే ఉంటారు. నిజానికి కొన్ని కొన్ని సార్లు పట్టరాని సంతోషంగా ఉన్నప్పుడు, ఆసక్తిగా ఉన్నప్పుడు కూడా ఏడుపు వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఏడుపు మీ భావోద్వేగాలను తిరిగి సమతుల్యం చేస్తుంది. కాబట్టి ఏడుపు మీ భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది. ఏడుపు ద్వారా మీ శరీరం చాలా బలమైన భావోద్వేగాలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. 

మూడ్ బాగుంటుంది

ఏడుపు కూడా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే కన్నీళ్లలో నరాల పెరుగుదల కారకాలు ఉంటాయి. ఇవి నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా మీరు ఏడుస్తున్నప్పుడు మీ శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

click me!