ఎన్టీఆర్ పై సెటైర్లు.. 1109 ఓట్లతో విజయనిర్మల ఓటమి!

Published : Jun 27, 2019, 04:15 PM ISTUpdated : Jun 27, 2019, 04:49 PM IST
ఎన్టీఆర్ పై సెటైర్లు.. 1109 ఓట్లతో విజయనిర్మల ఓటమి!

సారాంశం

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటి, దర్శకురాలు అయిన విజయనిర్మల మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అప్పట్లోనే తన విజయనిర్మల మల్టీ టాలెంటెడ్ నటిగా సత్తా చాటారు. 

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, నటి, దర్శకురాలు అయిన విజయనిర్మల మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అప్పట్లోనే విజయనిర్మల మల్టీ టాలెంటెడ్ నటిగా సత్తా చాటారు. మహిళా దర్శకురాలిగా ఆమె సాహసం చేయడమే కాదు విజయం సాధించారు కూడా. ఇక విజయనిర్మల రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం విజయనిర్మల సొంతం. 

స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో చిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకు మద్దతుగా నిలిచింది. కానీ కృష్ణ, విజయనిర్మల మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనపై కృష్ణ నుంచి విమర్శనాత్మక చిత్రాలు వచ్చాయి. 

ఎన్టీఆర్ పై సెటైరికల్ గా రూపొందిన ప్రజల మనిషి, సాహసమే నా ఊపిరి చిత్రాలకు విజయనిర్మలే దర్శకురాలు కావడం విశేషం. ఈ చిత్రాల్లో కృష్ణ హీరోగా నటించారు. తనకు వ్యక్తిరేకంగా సినిమాలు తీసినా ఎన్టీఆర్ మాత్రం స్పోర్టివ్ గా తీసుకున్నారని ఓ సందర్భంలో విజయనిర్మల తెలిపారు. 

మరో విశేషం ఏంటంటే.. టిడిపి పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చిన తర్వాత విజయనిర్మల ఆ పార్టీ తరపునే 1999లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కైకలూరు నుంచి పోటీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఆమె 1109 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కొన్ని రోజుల తర్వాత టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలిగారు. ఇలా విజయనిర్మల రాజకీయాల్లో కూడా కొంతకాలం కొనసాగారు. 

విజయనిర్మల పార్థివదేహానికి పవన్ కళ్యాణ్ నివాళి!

ఎన్టీఆర్ కొడితే కిందపడిపోయిన వేళ.. సావిత్రి, విజయనిర్మల మధ్య రిలేషన్!

మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు: పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా