యువతిని రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోన్న నటుడు!

By AN TeluguFirst Published May 6, 2019, 2:51 PM IST
Highlights

ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ ఓ యువతిని రేప్ చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్న కారణంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ ఓ యువతిని రేప్ చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్న కారణంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కరణ్ పై ఐపీసీ సెక్షన్ 376, 384 ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మోడల్, నటుడు అయిన కరణ్ పెళ్లి పేరుతో సదరు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, అంతేకాకుండా సదరు యువతి అభ్యంతరకర ఫోటోలను, వీదియోలను బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఫ్యాషన్, ఫిట్నెస్ మోడల్ అయిన కరణ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. మహేష్ భట్ 'స్వాభిమాన్' అనే సీరియల్ తో కెరీర్ మొదలుపెట్టిన కరణ్ 'సాయ', 'జస్సి జైసీ కోయి నహీ' వంటి టీవీ షోలలో నటించాడు. 2001లో ఏర్పాటైన 'ఏ బ్యాండ్ ఆఫ్ బాయ్స్' లో కరణ్ కూడా ఒక మెంబర్. అలానే చాలా ప్రకటనల్లో కూడా నటించారు.  

 

click me!