ఎన్టీఆర్‌ `దేవర` షూటింగ్‌లో ప్రమాదం..? ఆసుపత్రిలో చేరిన 20 మంది ఆర్టిస్టులు.. ఫ్యాన్స్ లో ఆందోళన

Published : May 06, 2024, 09:04 PM ISTUpdated : May 06, 2024, 11:32 PM IST
ఎన్టీఆర్‌ `దేవర` షూటింగ్‌లో ప్రమాదం..? ఆసుపత్రిలో చేరిన 20 మంది ఆర్టిస్టులు.. ఫ్యాన్స్ లో ఆందోళన

సారాంశం

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఇరవై మంది ఆర్టిస్టులు గాయపడ్డారట. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.   

ఎన్టీఆర్‌ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం `దేవర`. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఇది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండటం, సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలున్నాయి. దీనికితోడు ఇందులో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తుంది. దేవరగా, వరగా ఆయన కనిపిస్తారని సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త షాకిస్తుంది. తారక్‌ అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుందట. ఇందులో సినిమా టీమ్‌కి సంబంధించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు 20 మంది ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్‌లో తేనటీగలు దాడీ చేశాయట. తేనెటీగలు వెంబడించడంతో సుమారు 20 మందికి గాయాలు అయినట్టు తెలుస్తుంది. తేనెటీగలు కరవడం కారణంగా దాదాపు ఇరవై మంది యూనిట్‌కి చెందిన జూ ఆర్టిస్టులు, టెక్నిషియన్లు గాయాలపాలు అయ్యారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలుస్తుంది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదం వద్ద జరుగుతుందట. షూటింగ్‌ చేస్తున్న సమయంలో టీమ్‌పై తేనెటీగలు దాడి చేశాయని ఇందులో ఇరవై మంది గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారట. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

అయితే ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ లేరు. ఆయన ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. `వార్‌ 2` షూటింగ్‌ కోసం గత వారం ఆయన ముంబయి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వారం మొత్తం అక్కడే ఉంటారని సమాచారం. అయితే ఈ సంఘటనకు సంబంధించిన నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. నిజమేనా, పుకార్ల అనేది క్లారిటీ రావాల్సి ఉంది. టీమ్‌ స్పందిస్తేగానీ క్లారిటీ వస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌10న విడుదల కానుంది. ఎన్టీఆర్‌ సోలోగా నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది.భారీ స్థాయిలో దీన్ని విడుదల చేయబోతున్నారు.  
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి
Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే