కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌.. శివాజీనే గెస్ట్..ఎక్కడ ఎప్పుడు?

Published : May 06, 2024, 05:55 PM IST
కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌.. శివాజీనే గెస్ట్..ఎక్కడ ఎప్పుడు?

సారాంశం

బిగ్‌ బాస్ ‌తెలుగు 7 షోతో పాపులర్‌ అయిన కంటెస్టెంట్‌ టేస్టీ తేజ.. ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించారు. మరో బిగ్‌ బాస్‌ ఫేమ్‌, నటుడు శివాజీ దీన్ని ప్రారంభించడం విశేషం.   

బిగ్‌ బాస్‌ రియాలిటీ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. సాధారణ వ్యక్తుల్ని స్టార్లని చేసింది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయిన వాళ్లు బిగ్ బాస్‌ షోలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుని విశేషగుర్తింపుని తెచ్చుకుంటున్నారు. చాలా మంది సినిమాల్లో బిజీ అయితే మిగిలిన వారు వారి వ్యక్తిగత వ్యాపారాలు ప్రారంభించి బిజీ అవుతున్నారు. అందులో భాగంగా టేస్టీ తేజ తాజాగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాడు. 

ఫుడ్‌ వ్లాగర్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు తేజ. యూట్యూబ్‌లో ఫుడ్‌ వీడియోలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో బిగ్‌ బాస్‌ లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో మోస్ట్ ఎంటర్‌టైనింగ్‌ కంటెస్టెంట్‌గా నిలిచాడు. జోవియల్‌గా ఉంటూ నవ్వులు పూయించాడు. జోకులు వేస్తూ, ఫన్నీ యాక్టివిటీస్‌ చేస్తూ అలరించారు. శోభా శెట్టితో కెమిస్ట్రీ పండించి ఆకట్టుకుంటున్నారు. కానీ మధ్యలోనే ఎలిమినేట్‌ అయ్యాడు. అతని ఎలిమినేషన్‌ని అంతా విమర్శించారు. కానీ మంచి ఆడియెన్స్ ఆదరణ పొంది పాపులర్‌ అయ్యాడు తేజ. 

ఆ పాపులారిటీతో ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించాడు. టీ బిజినెస్‌ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫ్రాంఛైజీ టీ బిజినెస్‌ బాగా పాపులర్‌ అయ్యింది. బాగా రన్‌ అవుతున్న బిజినెస్‌ కూడా. దీంతో `ఇరానీ నవాబ్‌ టీ` పేరుతో ఫ్రాంఛైజీ టీ బిజినెస్‌ని స్టార్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం దీన్ని ఓపెన్‌ చేశారు. కార్పొరేట్‌ స్టయిల్‌లో ఈ టీ బిజినెస్‌ని ప్రారంభించడం విశేషం. 

ఇక బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌, నటుడు శివాజీ దీనికి గెస్ట్ గా వచ్చాడు. ఆయన చేతుల మీదుగానే దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శివాజీ తన బెస్ట్ విషెస్‌ని తేజకి అందించారు. తేజ ఏం చేసినా ప్లానింగ్‌తో ముందుచూపుతో చేస్తాడని, మున్ముందు బాగా డబ్బులు వస్తాయని ఆశించే ఈ వ్యాపారం స్టార్ట్ చేశాడని, సరదాగా చెప్పడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉప్పల్‌ డీఎస్‌ఎల్ మాల్‌ సమీపంలో ఈ వ్యాపారం ప్రారంభించడం విశేషం.  ఈ టీ షాప్‌ ఓపెనింగ్‌లో బిగ్ బాస్‌ టీమ్‌  అమర్‌ దీప్‌, శుభ శ్రీ, ప్రియాంక జైన్‌ పాల్గొనడం విశేషం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?