ఈ కొత్త రూల్ కు మన హీరోలు ఒప్పుకుంటారా?

By Surya PrakashFirst Published Apr 25, 2020, 8:45 AM IST
Highlights

 లాక్ డౌన్ ఎత్తేసాక, పరిస్దితుల కానీ అనుకూలిస్తే వెంటనే షూటింగ్ లు మొదలు పెట్టాలా, అదే కనక జరిగితే ఎలాంటి ప్రాక్టికల్ ప్లాబ్లంస్ వస్తాయి అనేది తెలుగు నిర్మాతలు వీడియో కాన్ఫరెన్స్ లలో నిరంతరం చర్చిస్తున్నారు. ఎందుకంటే సగంలో ఆగిపోయిన పెద్ద సినిమాలు వెంటనే షూట్ స్టార్ట్ చేయకపోతే ఆర్దికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. ఈ నేపధ్యంలో జూలై నాటికి షూటింగ్ లు మొదలైతే ...ఏం చేయాలి..కాకపోతే ఏం చేయాలనే ఓ కార్యాచరణకు వచ్చినట్లు సమాచారం. అందుకోసం కొన్ని నిబంధనలు సైతం రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. 


కరోనా, దాని వలన వచ్చిన లాక్ డౌన్ ప్రపంచం మాట ఎలా తెలుగు సినిమావాళ్లకు మాత్రం రకరకాల తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒకటిరెండు నెలల్లో ఈ సమస్య తగ్గిపోతుంది, షూటింగ్ లకు వెళ్దామనే ఆశ పోతోంది. అయితే లాక్ డౌన్ ఎత్తేసాక, పరిస్దితుల కానీ అనుకూలిస్తే వెంటనే షూటింగ్ లు మొదలు పెట్టాలా, అదే కనక జరిగితే ఎలాంటి ప్రాక్టికల్ ప్లాబ్లంస్ వస్తాయి అనేది తెలుగు నిర్మాతలు వీడియో కాన్ఫరెన్స్ లలో నిరంతరం చర్చిస్తున్నారు. ఎందుకంటే సగంలో ఆగిపోయిన పెద్ద సినిమాలు వెంటనే షూట్ స్టార్ట్ చేయకపోతే ఆర్దికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. ఈ నేపధ్యంలో జూలై నాటికి షూటింగ్ లు మొదలైతే ...ఏం చేయాలి..కాకపోతే ఏం చేయాలనే ఓ కార్యాచరణకు వచ్చినట్లు సమాచారం. అందుకోసం కొన్ని నిబంధనలు సైతం రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

ఆ రూల్స్ లో ముఖ్యమైనది...ప్రస్తుతం హీరోలు, క్యారక్టర్ ఆర్టిస్ట్ లు ఈ లాక్ డౌన్ పూర్తయ్యాక ఏ కొత్త సినిమాలు కమిటవ్వకూడదు. తమ పెండింగ్ సినిమాలు పూర్తయ్యేదాకా. ఇప్పటిదాకా ఒప్పుకున్న సినిమాలు ప్రయారిటీ ప్రకారం పూర్తి చేయాలి. ఇది కనుక ఎవరైనా తప్పితే ఫిల్మ్ ఛాంబర్ ఆ హీరో లేదా నటీ,నటులుపై యాక్షన్ తీసుకుంటుంది. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. అదే సమయంలో ఎవరైతే ఈ నిబంధనలుకు వ్యతిరేకంగా ముందుకు వెళ్తారో ఆ నిర్మాతపై కూడా వేటు పడుతుంది. ఈ విషయంలో చాలా నిర్దాక్ష్యణ్యంగా ఉండాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు ఒప్పుకుని, ఆల్రెడీ కమిటైనవి ప్రక్కన పెడితే రకరకాల వివాదాలు వచ్చే అవకాసం ఉంది.

 ఈ కరోనా లౌక్ డౌన్ టైమ్ లో ఇచ్చిన డేట్స్ ని,సాకుగా చూపితే కుదరదు అని రూల్ పాస్ చేయబోతున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం.  అదే సమయంలో పూర్తైన తమ సినిమాలు ఒటీటీకు ఇవ్వాలా వద్దా అనేది డబ్బు పెట్టిన నిర్మాత నిర్ణయిస్తాడు. అంతేకానీ హీరో లు కాదు . ఒకసారి ప్రాజెక్టు పూర్తయ్యాక నిర్మాతకు అన్నిరకాల రైట్స్ ఉంటాయి. ఆ విషయంలో ఏ హీరో వేలు పెట్టరాదు. అలా చేస్తే ఆ వచ్చే నష్టం హీరో భరించటానికి సిద్దంగా ఉండాలి. అంటే ఓటీటికు వద్దు, డైరక్ట్ రిలీజ్ కే అని హీరో పట్టుబడితే..రేపు థియోటర్ లో ఈ సినిమా వర్కవుట్ కాకపోతే నష్టం భరించాలి. అయితే ఈ నిబంధనలకు వినటానికి బాగానే ఉన్నాయి కాని ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో చూడాలి. ఎందుకంటే హీరోలను కాదనలేని బలహీనత మన నిర్మాతలలో చాలా మందిది. ఈ నిర్ణయాలు మన తెలుగు సినిమా పెద్దలంతా మాట్లాడుకుని తీసుకున్నట్లు సమాచారం. 
 

click me!