'సైరా' డిజిటల్ బిజినెస్.. హోల్ సేల్ గా రూ.125 కోట్లు!

By AN TeluguFirst Published Sep 18, 2019, 1:38 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఇప్పటికీ తగ్గలేదని చాటుతోంది ‘సైరా’ సినిమా. ఈ వయసులో, చిరు కెరీర్లో ఈ దశలో రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమా తీయడమంటే మాటలు కాదు.

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం 'సైరా'. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈరోజు సాయంత్రం 5:31ని.లకు సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా కోసం దాదాపు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి తగ్గట్లే బిజినెస్ కూడా జరుగుతోంది. సినిమా థియే ట్రికల్ హక్కులను రూ.190 కోట్ల మేర అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక 'సైరా' శాటిలైట్, డిజిటల్ హక్కులు ఏకంగా రూ.125 కోట్లకు అమ్ముడైనట్లు వస్తోన్న సమాచారం షాక్ కి గురిచేస్తోంది.

'బాహుబలి', 'సాహో' సినిమాలకు తప్ప ఈ రేంజ్ లో సౌత్ లో ఏ సినిమాకి ఇంత రేటు పకలేదు. జీనెట్ వర్క్ సంస్థ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలకు సంబంధించి 'సైరా' హక్కులను రూ.125 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ కోసం రూ.40 కోట్లు, మిగిలిన భాషల కోసం రూ.85 కోట్లు పెట్టొచ్చనే లెక్కతో అంత డబ్బు ఆఫర్ చేశారట.

కాగా స్వాతంత్రసమరయోధుడు  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. 

ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్.. 'సైరా' ట్రైలర్ విడుదలయ్యే థియేటర్లు ఇవే..!

సైరా ప్రీమియర్ షోలు.. అప్పుడే టికెట్ల అమ్మకాలు!

'సైరా' కోసం రూల్స్ బ్రేక్ చేస్తోందా..? 

అఫీషియల్: 'సైరా' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం ఇదే!

మెగాస్టార్ ఉగ్రరూపం.. థియేటర్లలో సైరా ట్రైలర్!

సైరా మానియా: ఫ్యాన్స్ ఎదురుచూపులకు నాలుగు కారణాలివే...

బాహుబలిని మించిపోయిన 'సైరా'!

'సైరా' ప్రీరిలీజ్ బిజినెస్.. దిల్ రాజు సహా ఎవరెవరంటే!

సైరా కొత్త లుక్.. మాస్ మెగాస్టార్ తో ఆ ఇద్దరు.. తమిళ హీరో ట్వీట్!

click me!