స్టార్ హీరోకి విలన్ గా విజయ్.. ఫిక్స్ అయినట్లే?

Published : Sep 18, 2019, 01:07 PM ISTUpdated : Sep 18, 2019, 01:23 PM IST
స్టార్ హీరోకి విలన్ గా విజయ్.. ఫిక్స్ అయినట్లే?

సారాంశం

హీరోగా  క్రేజ్ తెచ్చుకోవడం కన్నా ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే ఆ కిక్కే వేరని విజయ్ సేతుపతి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అలా నటిస్తేనే నటుల కెరీర్ కి ఏ మాత్రం డోకా ఉండదనే పాయింట్ ని హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు.

హీరోగా  క్రేజ్ తెచ్చుకోవడం కన్నా ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటే ఆ కిక్కే వేరని విజయ్ సేతుపతి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అలా నటిస్తేనే నటుల కెరీర్ కి ఏ మాత్రం డోకా ఉండదనే పాయింట్ ని హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాల్లో కనిపిస్తున్న విజయ్ ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాల్లో నటించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

సినిమాలో స్టోరీ ఎంత వీక్ గా ఉన్నా లేకపోయినా  విజయ్ సేతుపతి కనిపిస్తే చాలు ఆ కథకు ఒక బలం వచ్చినట్టే. డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకునే ఈ స్టార్ యాక్టర్  ఇప్పుడు ఇలయథలపతి విజయ్ సినిమాలో విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ బిగిల్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అనంతరం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. 

ఆ సినిమాలో విజయ్ కి విలన్ గా విజయ్ సేతుపతి కనిపిస్తాడని టాక్ వస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్ ని దర్శకుడు మరికొన్ని వారాల్లో స్టార్ట్ చేయనున్నాడు. విజయ్ సేతుపతి నెక్స్ట్ బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ తో  నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ తో నటించిన సైరా సినిమా బాలీవుడ్ లో అక్టోబర్ 2న భారీగా రిలీజ్ కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్