తనుశ్రీదత్తా వివాదం.. ఆడియో టేపుల్లో ఏం మాట్లాడారంటే..?

By Udayavani DhuliFirst Published Oct 5, 2018, 1:44 PM IST
Highlights

బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది. నానాపటేకర్, దర్శకుడు అగ్నిహోత్రిపై ఆమె చేసిన ఆరోపణలు వివాదాలను సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై తనుశ్రీపై లీగల్ గా చర్యలు తీసుకోనున్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. 

బాలీవుడ్ నటి తనుశ్రీదత్తా వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది. నానాపటేకర్, దర్శకుడు అగ్నిహోత్రిపై ఆమె చేసిన ఆరోపణలు వివాదాలను సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై తనుశ్రీపై లీగల్ గా చర్యలు తీసుకోనున్నారు. ఆమెపై కేసు కూడా నమోదు చేశారు.

బాలీవుడ్ లో కొందరు తనుశ్రీకి మద్దతుగా నిలవగా.. మరికొందరు ఆమెకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియా 'హార్న్ ఓకే ప్లీజ్' నిర్మాత సమి సిద్దిఖి, దర్సకుయ్డు రాకేశ్ సారంగ్, నటుడు రజా మురాద్, గజేంద్ర చౌహాన్ లపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

ఇందులో కొన్ని ఆడియో టేపులు బయటకి వచ్చాయి. రజా మురద్.. తనుశ్రీ ఓవర్ గా రియాక్ట్ అవుతుందని, టచ్ చేసినందుకు ఇంతగా రియాక్ట్ అవ్వాలా..? అంటూ ఆమెపై వ్యాఖ్యలు చేయగా, పదేళ్ల తరువాత ఈ పంచాయితీ ఏంటంటూ గజేంద్ర చౌహాన్ అన్నారు.

రాకేశ్ సారంగ్ బిగ్ బాస్ ఎంట్రీ కోసమే ఆమె ఈ నాటకాలు చేస్తుందని అనగా నిర్మాత సమీ మరీ దారుణమైన కామెంట్స్ చేశారు. బహుసా ఆరోజు తనుశ్రీ పీరియడ్స్ లో ఉన్నట్లుందని అందుకే ఇంతగా రియాక్ట్ అయి ఉంటుందని అన్నాడు. బాలీవుడ్ వీరి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి! 

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

 

click me!