కౌశల్ గెలిచినా.. గీతాదే పైచేయి!

By Udayavani DhuliFirst Published Oct 5, 2018, 12:55 PM IST
Highlights

బిగ్ బాస్ విజేతగా కౌశల్ గెలిచిన సంగతి తెలిసిందే. అతడు గెలిచినప్పటికీ గీతాదే పైచేయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారిలో సింగర్ గా గీతామాధురికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. 

బిగ్ బాస్ విజేతగా కౌశల్ గెలిచిన సంగతి తెలిసిందే. అతడు గెలిచినప్పటికీ గీతాదే పైచేయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్2 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న వారిలో సింగర్ గా గీతామాధురికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది.

షోలో పాల్గొన్న అందరికంటే ఆమె రెమ్యునరేషనే ఎక్కువ.. ఆమెకి ఎక్కువ మొత్తాన్ని ఇవ్వడంతో పాటు టైటిల్ కూడా కట్టబెట్టాలని అనుకున్నారని టాక్. కానీ అనూహ్యంగా కౌశల్ కి క్రేజ్ పెరిగి అతడికి ఎక్కువ ఓట్లు పడడంతో గీతా రన్నరప్ గా నిలిచింది.

అయినప్పటికీ ఆమెకి భారీ మొత్తంలో చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే కౌశల్ కంటే ఆమె అందుకున్న మొత్తమే ఎక్కువని అంటున్నారు. కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడానికి చాలా కృషి చేశాడని, అతి తక్కువ పారితోషికంతో ఆయన హౌస్ లోకి వెళ్లినట్లు సమాచారం.

హౌస్ లో పాల్గొన్న అందరికంటే కౌశల్ కే తక్కువ రెమ్యునరేషన్ అందిందని సమాచారం. ఈ ప్రకారంగా కౌశల్ టైటిల్ గెలిచినప్పటికీ డబ్బు పరంగా గీతాకే బాగా ముట్టజెప్పారని  సమాచారం!

ఇవి కూడా చదవండి.. 

బోయపాటి సినిమాపై బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కామెంట్స్!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

click me!