బాలయ్య కాళ్లు పట్టుకున్న వృద్ధుడు.. ఫోటోలు వైరల్!

Published : Oct 05, 2018, 12:39 PM ISTUpdated : Oct 05, 2018, 12:40 PM IST
బాలయ్య కాళ్లు పట్టుకున్న వృద్ధుడు.. ఫోటోలు వైరల్!

సారాంశం

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య తరచూ వార్తల్లో నానుతూనే ఉన్నారు. రీసెంట్ గా ఓ అభిమానిని కొట్టడం, ఆ తరువాత పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగుతూ కనిపించడం ఇలా ఏదోక వివాదంలో బాలయ్య పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా ఓ నిరుపేద వృద్ధుడు బాలయ్య కాళ్లకి మొక్కుతూ కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

నందమూరి బాలకృష్ణ ఈ మధ్య తరచూ వార్తల్లో నానుతూనే ఉన్నారు. రీసెంట్ గా ఓ అభిమానిని కొట్టడం, ఆ తరువాత పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగుతూ కనిపించడం ఇలా ఏదోక వివాదంలో బాలయ్య పేరు వినిపిస్తూనే ఉంది. 

తాజాగా ఓ నిరుపేద వృద్ధుడు బాలయ్య కాళ్లకి మొక్కుతూ కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చిత్రబృందం హంసలదీవికి వెళ్లింది.

అక్కడ బాలకృష్ణతో పాటు మరికొందరు నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ కోసం బాలయ్య అక్కడకి వచ్చాడని తెలుసుకున్న ఓ వృద్ధుడు ఆయన్ని కలిసి.. తను క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నట్లు వెల్లడించాడు. 

వెంటనే స్పందించిన బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి ఫోన్ చేసి ఆ వృద్ధుడు వివరాలు తెలియజేశారు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని బాలయ్య హాస్పిటల్ సిబ్బందికి చెప్పాడు. బాలయ్య చేసిన సాయంతో ఆ వృద్ధుడు వెంటనే ఆయన పాదాలకు మొక్కాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి.. 

బాలయ్య స్మోకింగ్ వీడియో వైరల్!

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు గట్టిగా ఇచ్చిపడేసిన కార్తీక్- మనుమడిని మెచ్చుకున్న పారు
Bayilone Ballipalike : దుమ్ములేపుతున్న మంగ్లీ ఫోక్ సాంగ్, 10 రోజుల్లోనే ఎన్ని కోట్ల వ్యూస్ రాబట్టిందంటే?