సైరా ట్రైలర్ పై వర్మ కామెంట్.. రామ్ చరణ్ కి కృతజ్ఞతలు!

Published : Sep 26, 2019, 12:39 PM IST
సైరా ట్రైలర్ పై వర్మ కామెంట్.. రామ్ చరణ్ కి కృతజ్ఞతలు!

సారాంశం

ఇక ఏమైందో ఏమో గాని వర్మ సైరా సినిమాపై మొదటిసారి స్పందించాడు. అది కూడా పాజిటివ్ గా కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రతిసారి ఎదో ఒక కాంట్రవర్సీ తో ట్వీట్ చేస్తారనేది అందరికి తెలిసిన విషయమే. ఇక ఎప్పుడైనా ఆయన పాజిటివ్ వే లో కామెంట్ చేశారో అదొక ఊహించని అద్భుతమని చెప్పాలి. ఇక ఏమైందో ఏమో గాని వర్మ సైరా సినిమాపై మొదటిసారి స్పందించాడు.

అది కూడా పాజిటివ్ గా కామెంట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.  టాలీవుడ్ పాన్ ఇండియన్ మూవీగా సైరా నరసింహారెడ్డి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సినిమా తెలుగు హిందీ తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

అయితే సినిమాకు సంబందించిన రెండవ ట్రైలర్ ని రిలీజ్ చేయగా వర్మ కుదోస్ అంటూ మెగాస్టార్ ని ఒక రేంజ్ లో పొగిడారు.  మెగాస్టార్ చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా ట్రైలర్ అద్భుతంగా ఉందని ఫాదర్ అండ్ ఆడియెన్స్ కి నిర్మాత రామ్ చరణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నారని అన్నారు. అందుకు రామ్ చరణ్ కి ధన్యవాదాలు అని ఆర్జీవీ ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం