ఆర్ ఆర్ ఆర్ హీరోలను అలా కాపాడుకోనున్న రాజమౌళి..!

By Satish ReddyFirst Published Sep 7, 2020, 3:26 PM IST
Highlights

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుపెట్టిననాటి నుండి అనేక అవాంతరాలు ఎదురుకావడం జరిగింది. అనేక రకాల కారణలతో షూటింగ్ వాయిదాపడడం జరిగింది. అందులో ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ గాయాలపాలు కావడం కూడా ఒకటి. 
 

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. దసరా తరువాత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి రాజమౌళి ముహూర్తం పెట్టారని సమాచారం. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తున్న రాజమౌళి షూటింగ్ నిరవధికంగా జరిపేందుకు తగు ప్రణాళికలు వేస్తున్నారట. వచ్చే ఏడాది ఆర్ ఆర్ ఆర్ ని ఎట్టిపరిస్థితులలో విడుదల చేయాలనేది రాజమౌళి ఆలోచనగా తెలుస్తుంది. ఇప్పటికే అనుకున్న సమయానికి ఏడాదికి పైగా ఆర్ ఆర్ ఆర్ విడుదల పోస్ట్ ఫోన్ అయ్యేలా కనిపిస్తుంది. మరో వైపు నిర్మాతల నుండి కూడా రాజమౌళిపై ఒత్తిడి పెరిగిపోయింది. దీనితో పక్కా ప్లాన్ తో వీలైనంత త్వరగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. 

కాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లేటవడానికి కారణాలలో హీరోలు గాయాలపాలు కావడం కూడా ఒకటి. మొదటిగా రామ్ చరణ్ ఓ యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటూ ప్రమాదానికి గురయ్యాడు. ఆయన మోకాలికి గాయం కాగా కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆయన కోలుకున్న కొద్దిరోజులలో ఎన్టీఆర్ చేతికి కూడా గాయం అయ్యింది. ఇలా ఇద్దరు హీరోలు గాయాలపాలు కావడం జరిగింది. దీనివలన దాదాపు మూడు నెలలకు పైగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వాయిదాపడింది. 

దీనితో రాజమౌళి ఈ విషయంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారని సమాచారం. మిగిలిఉన్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఎన్టీఆర్, చరణ్ భయంకరమైన పోరాట సన్నివేశాలలో పాల్గొనాల్సి ఉంది. కాబట్టి రిస్కీ స్టంట్స్ వలన వీరికి గాయాలు అయ్యే ఛాన్సులు మరింతగా ఎక్కువగా ఉంది. దీనితో రాజమౌళి అలా జరగకుండా నిపుణులను ఏర్పాటు చేయనున్నాడట. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నిపుణుల పర్యవేక్షణ ఉండేలా జాగ్రత్త పడనున్నాడట. అలా ఎన్టీఆర్, చరణ్ సెట్స్ లో భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోనున్నాడని తెలుస్తుంది. 
 

click me!