మహేష్, నమ్రతల ఓటు ఎవరికో..?

By Udayavani DhuliFirst Published Dec 7, 2018, 12:18 PM IST
Highlights

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం మొత్తం ఎన్నికల హడావిడిలో ఉంది. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. 

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం మొత్తం ఎన్నికల హడావిడిలో ఉంది. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సీనియర్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకొని అభిమానులకు స్పూర్తిగా నిలుస్తున్నారు.

కొద్దిసేపటి క్రితం సూపర్ స్టార్ కృష్ణ తన భార్య విజయనిర్మలతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం నానకరాంగూడలో బూత్ నెంబర్ 17లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అతడి భార్య నమ్రతతో కలిసి జూబ్లిహిల్స్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు. వచ్చీ రాగానే నేరుగా బూట్ లోకి వెళ్లి తన ఓటు హక్కుని వినియోగించుకున్నాడు.

మహేష్ బాబుకి తెలంగాణా మినిస్టర్ కేటీఆర్ తో ప్రత్యేకమైన బంధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మరి ఆయన ఎవరికి ఓటు వేశారో..? శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

తెలంగాణా ఎన్నికలు: రాఘవేంద్రరావుకి చేదు అనుభవం!

ఓటర్లకు మంచు లక్ష్మీ సజెషన్!

రాజమౌళి, శేఖర్ కమ్ముల ఓటేశారు!

భారీ క్యూలో నిల్చున్న ఎన్టీఆర్!

ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి!

ఓటేసిన వెంకటేష్, నితిన్!

ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, నాగార్జున, అమల!

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి.. హరీష్ రావు

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి

click me!