నోటా వద్దు.. ఆ చెత్తలోనే ఓ బెటర్ వ్యక్తిని ఎన్నుకోండి!

By Prashanth MFirst Published Dec 7, 2018, 12:06 PM IST
Highlights

టాలీవుడ్ సినీ ప్రముఖులు ఓటు వెయ్యడమే కాకుండా ఓటు విలువ గురించి ఎవరి స్టైల్లో వారు వివరణ ఇస్తున్నారు. సీనియర్ దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి కూడా తనదైన శైలిలో ఓటు గురించి తెలిపారు.

టాలీవుడ్ సినీ ప్రముఖులు ఓటు వెయ్యడమే కాకుండా ఓటు విలువ గురించి ఎవరి స్టైల్లో వారు వివరణ ఇస్తున్నారు. సీనియర్ దర్శకుడు, నిర్మాత వైవిఎస్ చౌదరి కూడా తనదైన శైలిలో ఓటు గురించి తెలిపారు. ముఖ్యంగా నోటా వద్దు అంటూ.. మొత్తం చెత్త అనిపిస్తే ఆ చెత్తలోనే బెటర్ నాయకుడిని ఎంచుకోండి అని తెలిపారు. 

ప్రపంచంలో బ్రతకాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. అదే విధంగా దేశంలో రాష్ట్రంలో ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం హక్కులను రక్షించుకునేందుకు పనిచేసేదే ఓటు ఆక్సిజన్. అందుకే వెంటనే మీ ఎస్‌ఓసీఎల్(సోషల్ ఆక్సిజన్ సిలిండర్ టూ లీవ్)ని బుక్ చేసుకోండని తెలుపుతూ.. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని చేజార్చుకోవద్దని అన్నారు. 

అదే విధంగా ఒక గమనిక అంటూ.. ఇతర కారణాల వల్ల ఓటు హక్కును చేజార్చుకోవద్దని చెబుతూ.. నోటాను అస్సలు ఎంచుకోవద్దని.. నోటా అంటే అభ్యర్థులను తిరస్కరించడమే.. అలాంటి ఆలోచనతో ఉంటె.. ఆ చెత్తలోనే ఒక బెటర్ వ్యక్తిని ఎన్నుకోవాలని వైవిఎస్ చౌదరి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

click me!