తెలంగాణా ఎన్నికలు: రాఘవేంద్రరావుకి చేదు అనుభవం!

Published : Dec 07, 2018, 12:04 PM IST
తెలంగాణా ఎన్నికలు: రాఘవేంద్రరావుకి చేదు అనుభవం!

సారాంశం

తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.

తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావుకి చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఫిల్మ్ నగర్ లో శుక్రవారం ఓటు వేయడానికి వెళ్లిన ఆయన్ని ఓటర్లు అడ్డుకున్నట్లు సమాచారం.

క్యూలో నిలుచోకుండా నేరుగా బూత్ లోకి వెళ్తున్న రాఘవేంద్రరావుని క్యూలో వెళ్లాలని కోరారు. దీంతో ఆయన ఓటు వేయకుండానే వెనుతిరిగారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇదే అనుభవం ఎదురైంది.

ఆయన కూడా క్యూలో నిలుచోకుండా ఓటేయడానికి ప్రయత్నించగా.. ఓ వ్యక్తి నిలదీశారు. దీంతో ఆయన క్యూలో వెళ్లి ఓటేశారు. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Gift: `ఓజీ` దర్శకుడికి పవన్‌ కళ్యాణ్‌ ఊహించని గిఫ్ట్.. సుజీత్‌ ఎమోషనల్‌
9 సినిమాలు చేస్తే.. అందులో 8 ఫ్లాప్‌లు.. పాన్ ఇండియా స్టార్‌పైనే ఆశలన్నీ.. ఎవరీ హీరోయిన్.?