కాస్ట్లీ గా కార్తీకేయ 2 ప్రమోషన్స్.. క్రేజీ ఆఫర్స్ తో రూ.6 లక్షలు గెలుచుకునే అవకాశం.. ఫస్ట్ క్లూ వచ్చేసింది..

By team teluguFirst Published Jul 31, 2022, 12:52 PM IST
Highlights

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన ‘కార్తీకేయ 2’ మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ కాస్ట్లీ గా కొనసాగిస్తోంది. తాజాగా రూ.6 లక్షలు గెలుచుకునే ఓ ఆఫర్ ను అనౌన్స్ చేసిన యూనిట్.. మొదటి క్లూను రిలీజ్ చేసింది.
 

హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) తాజాగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘కార్తీకేయ 2’. ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. రొటీన్ కు భిన్నంగా  ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆడియెన్స్ ను కూడా తమ ప్రమోషన్స్ లో భాగస్వామ్యులను చేస్తున్నారు.  నిన్న క్రేజీ ఆఫర్ ను అనౌన్స్ చేశారు. రాష్ర్టంలోని నాలుగు ముఖ్య నగరాల్లో  బంగారు శ్రీకృష్ణ విగ్రహాలను దాచిపెడుతున్నామని తెలిపారు. వాటిని కనిపెట్టిన వారికి రూ.6 లక్షల విలువగల బంగారు ప్రతిమలను బహూకరిస్తామని ప్రకటించారు.

అయితే, ఈ ప్రతిమలను కనిపెట్టేందుకు లోకేషన్స్ లోని కొన్ని ఆనవాళ్లతో కూడిన క్లూ కూడా ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా తాజాగా ఫస్ట్ క్లూ ను రివీల్ చేశారు. ‘కార్తికేయ క్వెస్ట్‌లో లార్డ్ కృష్ణ ప్యూర్ గోల్డ్ ఐడల్ గెలవడానికి మొదటి క్లూను రివీల్ చేస్తున్నాం... విశ్వం ఒక పూసల దందా… నీది నీ భాగ్యం లో ఉందీ అంటే భాగ్యనగరపు నదిబొడ్డులో ఉన్నా జనాల పూసల దండని చేరుకో.. గెట్ సెర్చ్’ అంటూ ఫస్ట్ క్లూను ఇచ్చారు. ఇఫ్పటికే ఈ పోస్ట్ పై నెటిజన్లు, ఆడియెన్స్ రెస్పాండ్ అవుతున్నారు.  

ఈ చిత్రం ఆగస్టు 12న  ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్, క్వెస్ట్ లో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. విభిన్న కథాంశాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న నిఖిల్ తాజాగా తన సినిమా Karthikeya2పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది.  గ్లామర్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్, నిఖిల్ సరసన నటిస్తోంది. ఆయా పాత్రల్లో అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు నటిస్తున్నారు.  జూలై 22న ఐదు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అఫిషియల్ ప్రకటించారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.  

 

Hyderabad 🚨

Here's the first clue to win Lord Krishna Pure Gold Idol in the ❤️

“Vishwam Oka Poosala Danda…
Nidhi nee Bhagyam lo undi ante Bhagyanagarapu Nadiboddu lo unna Janala Poosala Dandani cheruko”

Get searching 🔥 pic.twitter.com/CsytstJ2Iy

— Nikhil Siddhartha (@actor_Nikhil)
click me!