ఇన్నేళ్ల తర్వాత ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తున్న రేణు దేశాయ్.. ఆమె పార్ట్నర్ ఎవరో తెలుసా ?

Published : Apr 28, 2024, 10:23 PM IST
ఇన్నేళ్ల తర్వాత ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తున్న రేణు దేశాయ్.. ఆమె పార్ట్నర్ ఎవరో తెలుసా ?

సారాంశం

రేణు దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తరచుగా ఆమె అకిరా, ఆద్య కి సంబంధించిన విశేషాలని పోస్ట్ చేస్తున్నారు.

రేణు దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తరచుగా ఆమె అకిరా, ఆద్య కి సంబంధించిన విశేషాలని పోస్ట్ చేస్తున్నారు. ఏ సందర్భం వచ్చినా ఆమె అకిరా, ఆద్య గురించి ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె మరో ఇంటరెస్టింగ్ పోస్ట్ చేసింది. 

చాలా కాలం తర్వాత రేణు దేశాయ్ చాలా హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అయితే ఆమె ఒంటరిగా డ్యాన్స్ చేయడం లేదు. ఆమెకి ఓ డ్యాన్స్ పార్ట్నర్ కూడా ఉన్నారు. ఆ డ్యాన్స్ పార్ట్నర్ ఎవరో కాదు.. తన ముద్దుల కుమార్తె ఆద్య. 

ఇద్దరూ  మంచి మ్యూజిక్ కి లయబద్దంగా స్టైలిష్ గా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోకి  రేణు దేశాయ్.. మై ఫేవరిట్ డ్యాన్స్ పార్ట్నర్ అంటూ పోస్ట్ చేసింది. మీకు ఇష్టమైన డ్యాన్స్ పార్ట్నర్ తో డ్యాన్స్ చేయడం  మంచి వైద్యం లాంటిది అని రేణు దేశాయ్ పేర్కొంది. 

 

రేణు దేశాయ్ తన పిల్లలు ఎలాంటి అల్లరి వేషాలు వేసినా వాటిని రేణు దేశాయ్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. రేణు దేశాయ్ చివరగా రవితేజ టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అయితే ఆ చిత్రం నిరాశ పరచడంతో రేణు దేశాయ్ పాత్రకి గుర్తింపు దక్కలేదు.    

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా